Chiranjeevi | పెద్ద డాక్టర్‌ని పచ్చి బూతులు తిట్టిన చిరంజీవి.. పవన్ గొడవ విషయంలోనా?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం. ఆయనని ఎవరు ఎన్ని విమర్శలు చేసిన కూడా నిదానంగా ఉంటారు. చిరంజీవి ప్రవర్తన చూసి ఆయన అభిమానులే కొన్ని సార్లు షాక్ అవుతుంటారు. చిరంజీవి కోపం, ఆవేశం వంటివి సినిమాలలో చూడడమే తప్ప రియల్ లైఫ్‌లో ఎప్పుడు చూసి ఉండము. అసలు చిరుని కొందరు దారుణమైన కామెంట్స్ చేసిన కూడా ఆయనకి కోపం రాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అయితే భోళా శంకర్ ప్రీ రిలీజ్ […]

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఎంత ఎదిగిన ఒదిగి ఉండే స్వభావం. ఆయనని ఎవరు ఎన్ని విమర్శలు చేసిన కూడా నిదానంగా ఉంటారు. చిరంజీవి ప్రవర్తన చూసి ఆయన అభిమానులే కొన్ని సార్లు షాక్ అవుతుంటారు. చిరంజీవి కోపం, ఆవేశం వంటివి సినిమాలలో చూడడమే తప్ప రియల్ లైఫ్‌లో ఎప్పుడు చూసి ఉండము. అసలు చిరుని కొందరు దారుణమైన కామెంట్స్ చేసిన కూడా ఆయనకి కోపం రాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. అయితే భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి కోపం ఎలా ఉంటుందో దర్శకుడు బాబి తెలియజేశారు. ఓ సారి పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ పెద్ద డాక్టర్ ఇంట్లో జరుగుతుంది. లైట్‌మెన్స్ షూస్ వేసుకొని అటూ ఇటూ తిరుగుతున్నారు.
అయిదే అది చూసి తట్టుకోలేకపోయిన డాక్టర్ వారిని గట్టిగట్టిగా తిట్టాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఏంటండీ మీరు డబ్బులు తీసుకున్నాకే కదా షూటింగ్ చేస్తున్నాం. మీ ఇంటికి రెండ్ కూడా పే చేశాం కదా, మళ్లీ ఈ కండీషన్స్ ఏంటని అన్నారట. అయినా లైటింగ్ యూనిట్ వాళ్ళు చెప్పులు వేసుకునే ఉండాలి. ఎందుకంటే అది కరెంటుతో పని కాబట్టి వారు ధరించి ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ నచ్చజెప్పే ప్రయత్నం చేసిన కూడా ఓనర్ మాత్రం పవన్ కళ్యాణ్ మాట కూడా లెక్క చేయకుండా ఉంటే ఉండండి లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచారట.ఇక అప్పటికే పవన్ కోపం పీక్స్ లోకి వెళ్లడంతో ఆవేశంతో ఆయన షూటింగ్ నుండి వెళ్లిపోయారు.
ఈ విషయం చిరంజీవికి వేరే నిర్మాత ద్వారా చిరంజీవి వరకు వెళ్లింది. వెంటనే ఆయన ఓనర్ ఫోన్ నెంబర్ తీసుకొని మరీ ఆ వ్యక్తి కి కాల్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాడట. నా తమ్ముడిని ఇంటి నుండి వెళ్లమని చెప్పడానికి నీకెంత ధైర్యం. వెంటనే నాకు ఆ విషయం తెలిసి ఉంటే షూటింగ్ ఎలా జరగకుండా ఉండేవాడవో చూసేవాడిని అంటూ డాక్టర్‌కి ఫుల్ క్లాస్ పీకాడట. తనని ఎంతమంది ఎన్ని మాటలు అన్నా పడే చిరంజీవి తమ్ముళ్లను అంటే మాత్రం అస్సలు ఊరుకోడు. మనలాంటి తమ్ముళ్లని ఏమని అన్నా కూడా ఆయన అస్సలు ఊరుకోరు అంటూ చిరంజీవి గురించి బాబీ అద్భుతంగా మాట్లాడాడు.