‘మంచు’ ఫ్యామిలీకి కౌంటర్‌గానే.. చిరంజీవి ‘జంబలకిడి జారుమిఠాయ’ చేశాడ
వీరయ్య మంచు ఫ్యామిలీని టార్గెట్ చేశాడా? ఈ ఏడాది సంక్రాంతి జోరు ముగిసింది. లాంగ్ రన్‌లో బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ కంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. వీరసింహారెడ్డి కంటే ఎక్కువ కలెక్షన్లను సాధిస్తూ వీరయ్య వీర కుమ్ముడు కుమ్ముతున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవిని చాలాకాలం తర్వాత బాబీ ఇలా ప్రేక్షకుల మెచ్చుకునే, అభిమానులకు నచ్చే విధంగా సినిమా తీశాడని ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. బాలయ్యతో పోటీ […]

వీరయ్య మంచు ఫ్యామిలీని టార్గెట్ చేశాడా?
ఈ ఏడాది సంక్రాంతి జోరు ముగిసింది. లాంగ్ రన్‌లో బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ కంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది. వీరసింహారెడ్డి కంటే ఎక్కువ కలెక్షన్లను సాధిస్తూ వీరయ్య వీర కుమ్ముడు కుమ్ముతున్నాడు.
బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవిని చాలాకాలం తర్వాత బాబీ ఇలా ప్రేక్షకుల మెచ్చుకునే, అభిమానులకు నచ్చే విధంగా సినిమా తీశాడని ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. బాలయ్యతో పోటీ పడి విజయాన్ని సొంతం చేసుకున్న ‘వాల్తేరు వీరయ్య’ అనే బ్లాక్‌బస్టర్‌ని బాబీ మెగాస్టార్‌కు అందించాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు బాబీ అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. ఇక వీరయ్య విజయానికి దర్శకుడు కొరటాల శివ కూడా కారణమని షాకింగ్ కామెంట్ చేశాడు. బాబీ వీరయ్య సినిమా స్క్రిప్టులో భాగమైనందుకు కొరటాలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక ఈ సినిమాలోని ఓ కామెడీ సీన్‌పై కూడా స్పందించాడు.
చాలా సీన్స్ లో చిరంజీవి ఇచ్చిన సలహాలు ఎంతో బాగా వర్కవుట్ అయ్యాయని బాబీ చెప్పుకొచ్చాడు. ఓ కామెడీ సీన్‌లో భాగంగా చిరు సోషల్ మీడియాలో పాపులర్ అయిన జంబలకిడి జారు మిఠాయి పాటను తన శైలిలో పాడుతారు. ఈ పాట పెట్టాలనే ఆలోచన చిరంజీవిదే అని బాబీ బయట పెట్టారు.
నేను లుంగీ వేశా చూడు.. లుంగీ వేశా చూడు అని తన మార్కు కామెడీ పండించాడు చిరు. ప్రేక్షకులు ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్స్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీకి కౌంటర్‌గానే మెగాస్టార్ ఈ పాట పెట్టాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో బాబీ ఇచ్చిన క్లారిటీ కూడా దానికి మరింత బలం చేకూర్చేలా ఉందని చెప్పాలి. దీనిని మెగాస్టార్ చిరంజీవి పెట్టించారని ఇది ఆయన నిర్ణయం మేరకు మాత్రమే జరిగిందని ఆయన ఇచ్చిన సలహా వల్లనే ఈ పాటను పెట్టామని బాబీ క్లారిటీ ఇచ్చాడు.
మంచు ఫ్యామిలీ సినిమా ఈవెంట్‌లో పాపులర్ అయిన ఈ పాటను చిరంజీవి కావాలనే పెట్టాడన్న వాదనని బాబీ చెప్పిన మాటలు మరింత బలపరిచినట్లు అయింది. మరి ముందు ముందు మంచు ఫ్యామిలీ కుటుంబం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.