Rajasthan | బావిలో విద్యార్థిని మృత‌దేహం.. రేప్ చేసి చంపేసిన ఉపాధ్యాయుడు?

బాలిక తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు రాజ‌స్థాన్‌లో మ‌రో దారుణ ఘ‌ట‌న‌ Rajasthan | విధాత‌: రాజ‌స్థాన్‌లో మ‌రో దారుణం జ‌రిగింది. మ‌రో విద్యార్థిని బావిలో శ‌వంగా తేలింది. పాఠశాల ఉపాధ్యాయుడే బాలిక‌ను కిడ్నాప్ చేసి లైంగిక‌దాడికి పాల్ప‌డి, అనంత‌రం చంపేసి బావిలో ప‌డేశాడ‌ని బాలిక తండ్రి ఆరోపించారు. ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పాఠ‌శాల‌లోని ఇత‌ర ఉపాధ్యాయుల‌ను కూడా విధుల నుంచి తొల‌గించారు. సవాయ్ మాధోపూర్ (Sawai Madhopur) […]

Rajasthan | బావిలో విద్యార్థిని మృత‌దేహం.. రేప్ చేసి చంపేసిన ఉపాధ్యాయుడు?
  • బాలిక తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు
  • రాజ‌స్థాన్‌లో మ‌రో దారుణ ఘ‌ట‌న‌

Rajasthan | విధాత‌: రాజ‌స్థాన్‌లో మ‌రో దారుణం జ‌రిగింది. మ‌రో విద్యార్థిని బావిలో శ‌వంగా తేలింది. పాఠశాల ఉపాధ్యాయుడే బాలిక‌ను కిడ్నాప్ చేసి లైంగిక‌దాడికి పాల్ప‌డి, అనంత‌రం చంపేసి బావిలో ప‌డేశాడ‌ని బాలిక తండ్రి ఆరోపించారు. ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. పాఠ‌శాల‌లోని ఇత‌ర ఉపాధ్యాయుల‌ను కూడా విధుల నుంచి తొల‌గించారు.

సవాయ్ మాధోపూర్ (Sawai Madhopur) జిల్లాలోని ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌16 ఏండ్ల బాలిక ఈ నెల 8న అదృశ్యమైంది. ఆమెను కిడ్నాప్ చేశాడ‌ని పాఠ‌శాల ఉపాధ్యాయుడు రామనాథ‌న్‌ మీనా (Ramanathan Meena) పై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లోని బావిలో గురువారం బాలిక మృత‌దేహం ల‌భించింది. మృతదేహాన్ని పాఠ‌శాల ఎదుట పెట్టి మృతురాలి కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న‌కు దిగారు. సీనియర్ పోలీసు అధికారులతో విచారణ జ‌రిపి నిందితులను వెంటనే అరెస్టు చేయాల‌ని, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాల‌ని, మొత్తం పాఠశాల సిబ్బందిని తొలగించాలని డిమాండ్ చేశారు.

నిరసనల కారణంగా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేకపోయారు. నిందితుడు టీచర్ రామనాథ‌న్‌ మీనా (Ramanathan Meena) ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్టు స‌ర్కిల్ అధికారి తెలిపారు. అత‌డితోపాటు పాఠశాల‌లోని పురుష సిబ్బందిని తొల‌గించిన‌ట్టు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై కొంద‌రు ఈ నెల 2న సామూహిక లైంగిక‌దాడి జ‌రిపి చంపేశారు. వ‌రుస ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వంపై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి.