America | 50 ఏళ్ల నాటి రేప్ కేసులో నిర్దోషిగా తీర్పు.. జ‌డ్జిని కౌగిలించుకుని బాధితుడు క‌న్నీటిప‌ర్యంతం

America | విధాత‌: చేయ‌ని త‌ప్పున‌కు ఏకంగా 50 ఏళ్లుగా నీలాప‌నింద‌ల‌ను భ‌రిస్తున్న వ్యక్తిని ఇన్నేళ్ల త‌ర్వాత నిర్దోషిగా ప్ర‌క‌టించారు. ఈ తీర్పుతో గొప్ప ఊర‌ట పొందిన స‌ద‌రు బాధితుడు వెంట‌నే తీర్పు ఇచ్చిన జ‌డ్జిని ఆనందంతో కౌగిలించుకుని ధ‌న్య‌వాదాలు తెలిపారు. అమెరికా (America) లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల ప్ర‌కారం.. సౌత్ క‌రోలినా నివాసి అయిన లెనార్డ్ మ్యాక్ (72) ఓ టీనేజ‌ర్‌ను రేప్ చేశార‌ని ఆరోపిస్తూ ఐదు ద‌శాబ్దాల క్రితం 1975లో […]

America | 50 ఏళ్ల నాటి రేప్ కేసులో నిర్దోషిగా తీర్పు.. జ‌డ్జిని కౌగిలించుకుని బాధితుడు క‌న్నీటిప‌ర్యంతం

America |

విధాత‌: చేయ‌ని త‌ప్పున‌కు ఏకంగా 50 ఏళ్లుగా నీలాప‌నింద‌ల‌ను భ‌రిస్తున్న వ్యక్తిని ఇన్నేళ్ల త‌ర్వాత నిర్దోషిగా ప్ర‌క‌టించారు. ఈ తీర్పుతో గొప్ప ఊర‌ట పొందిన స‌ద‌రు బాధితుడు వెంట‌నే తీర్పు ఇచ్చిన జ‌డ్జిని ఆనందంతో కౌగిలించుకుని ధ‌న్య‌వాదాలు తెలిపారు. అమెరికా (America) లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాల ప్ర‌కారం.. సౌత్ క‌రోలినా నివాసి అయిన లెనార్డ్ మ్యాక్ (72) ఓ టీనేజ‌ర్‌ను రేప్ చేశార‌ని ఆరోపిస్తూ ఐదు ద‌శాబ్దాల క్రితం 1975లో దోషిగా నిర్ధ‌రించారు.

ఏడున్న‌ర ఏళ్ల పాటు జైలు శిక్ష కూడా వేయ‌డంతో ఆ మ్యాక్ ఆ శిక్షను అనుభ‌వించాడు. ఆ టీనేజ‌ర్‌ను తాను అత్యాచారం చేయక‌పోయిన‌ప్ప‌టికీ అందులో త‌న‌ను ఇరికించార‌ని, దీని వ‌ల్ల స‌మాజంలో తీవ్ర వివ‌క్ష‌ను ఎదుర్కొన్నాన‌ని మ్యాక్ వెల్ల‌డించాడు. అయితే ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ అనే ఒక న్యాయ సంస్థ అత‌డికి సాయం చేయ‌డానికి ముందుకొచ్చింది. మ‌ళ్లీ కేసును తెరిపించి.. విచార‌ణ చేయించింది.

ఒక నిర‌ప‌రాధిని ఇన్నేళ్ల పాటు దోషిగా ప‌రిగ‌ణించ‌డం అమెరికా చ‌రిత్ర‌లో ఇదే మొద‌టిసార‌ని ఆ సంస్థ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. విచార‌ణలో భాగంగా న్యాయ‌స్థానం ఈ సారి అడ్వాన్స్‌డ్ డీఎన్ఏ ప‌రీక్ష‌లు చేయాల‌ని ఆదేశించింది. వీటిలో ఆ నేరానికి మ్యాక్‌కు ఏ సంబంధం లేద‌ని ఫ‌లితాలు వ‌చ్చాయి. ఆ అత్యాచారాన్ని మ‌రో నేర‌స్థుడు చేశాడ‌ని సైతం పోలీసులు గుర్తించారు.

దీంతో 50 ఏళ్ల అత‌డి వేద‌న‌ను దూరం చేస్తూ కోర్టు అత‌డిని నిర్దోషిగా ప్ర‌క‌టించింది. జడ్జి తీర్పు విన‌గానే.. మ్యాక్ అక్క‌డే ఆనంద భాష్పాల‌తో త‌న వేద‌న‌ను పంచుకున్నాడు. త‌న‌కు ఈ ఘోర నింద నుంచి విముక్తి క‌లిపించిన ఆ మ‌హిళా జ‌డ్జిని కృత‌జ్ఞతా పూర్వ‌కంగా కౌగిలించుకుని ధ‌న్య‌వాదాలు తెలిపాడు.