Jagadish Reddy | సీఎం చేయూత.. జగదీష్ రెడ్డి చొరవ.. 2 దశాబ్దాల పేదల క‌ల సాకారం

Jagadish Reddy | 95 పేద కుటుంబాలకు ఇండ్ల పట్టాలు అందజేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి విధాత: సీఎం కేసీఆర్ చేయూత.. మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో సుందరయ్య నగర్‌కు చెందిన పేదల రెండు దశాబ్దాల క‌ల సాకారమైంది. పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యమని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గ కేంద్రం లోని 18వ వార్డు సుందరయ్య […]

Jagadish Reddy | సీఎం చేయూత.. జగదీష్ రెడ్డి చొరవ.. 2 దశాబ్దాల పేదల క‌ల సాకారం

Jagadish Reddy |

  • 95 పేద కుటుంబాలకు ఇండ్ల పట్టాలు
  • అందజేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి

విధాత: సీఎం కేసీఆర్ చేయూత.. మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో సుందరయ్య నగర్‌కు చెందిన పేదల రెండు దశాబ్దాల క‌ల సాకారమైంది. పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యమని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట నియోజకవర్గ కేంద్రం లోని 18వ వార్డు సుందరయ్య నగర్‌లో ఏళ్ల‌ క్రితం ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు వేసుకున్న 95మంది పేదలకు శాశ్వత ఇళ్ల‌ పట్టాలను మంత్రి పంపిణి చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ ప‌థ‌కాలు ప్రతి నిరుపేద‌కు అందించామ‌న్నారు. గూడు లేని వారు ఎన్నోఏండ్ల నుండి అభద్రతా భావంతో ఉంటున్నార‌న్న మంత్రి… సుందరయ్య నగర్ ప్రజల ఇరభై ఏళ్ల కల నెరవేరిందన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే అన్నారు. ఇక్కడ నివసిస్తున్న పేదలకు ఇండ్ల పట్టాలు మంజూరు చేసే అవకాశం త‌న‌కు కలగడం సంతోషంగా ఉందన్నారు.

పేదవాళ్లు ఎన్నో ఏళ్లుగా ఏ హక్కు లేకుండా జీవించడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకున్న మఖ్యమంత్రి ఇళ్ళ పట్టాలకు శ్రీకారం చూట్టారని తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. పేదలకు సొంత నివాసాల పేరుతో ఇళ్ళు నిర్మించి, వారిపై బ్యాంకుల్లో అప్పులు మోపిన చరిత్ర గత పాలకులదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 4000 కోట్లు మాఫీ చేసి రుణ విముక్తులను చేసిందన్నారు.

ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలకు మహిళలు,పేదల సంక్షేమమే కేంద్రబిందువన్నారు.. మహిళలు,పేదలు బాగుంటేనే తెలంగాణ సార్థకమైనట్లు అని నమ్మే నాయకుడు కేసీఆర్ అన్నారు. ఇళ్ళ పట్టాలు అందుకున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

మరో విడతలో 45మందికి ఇళ్ళ పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వెంకట్రావ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, కౌన్సిలర్ మాలోతు కమల చంద్రూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.