CM Jagan | సీఎం జగన్ విశాఖ పయనానికి కొత్త ముహూర్తం

టెక్కలి మీద క్లారిటీ ఇచ్చిన జగన్ విధాత‌: కంగారును ఆలస్యం మొగుడు అంటారు. అంతే మనం ఏదైనా పనికి ఎంత తొందర పడితే అంత ఆలస్యం అవుతుందట. సీఎం జగన్ పరిస్థితి అలాగే ఉంది. ఎంత త్వరగా మూడు రాజధానులు ప్లాన్ అమలు చేద్దామా.. ఎంత గమ్మున విశాఖ వెళ్లిపోదామా అనుకుంటుంటే అంతగా లేటు అవుతోంది. ఇప్పటికే మార్చ్, ఉగాది లోగా విశాఖ(Visakhapatnam) వెళ్తాను అని సీఎం జగన్ (CM Jagan) గతంలోనే ప్రకటన చేసారు. ఈ […]

CM Jagan | సీఎం జగన్ విశాఖ పయనానికి కొత్త ముహూర్తం
  • టెక్కలి మీద క్లారిటీ ఇచ్చిన జగన్

విధాత‌: కంగారును ఆలస్యం మొగుడు అంటారు. అంతే మనం ఏదైనా పనికి ఎంత తొందర పడితే అంత ఆలస్యం అవుతుందట. సీఎం జగన్ పరిస్థితి అలాగే ఉంది. ఎంత త్వరగా మూడు రాజధానులు ప్లాన్ అమలు చేద్దామా.. ఎంత గమ్మున విశాఖ వెళ్లిపోదామా అనుకుంటుంటే అంతగా లేటు అవుతోంది. ఇప్పటికే మార్చ్, ఉగాది లోగా విశాఖ(Visakhapatnam) వెళ్తాను అని సీఎం జగన్ (CM Jagan) గతంలోనే ప్రకటన చేసారు.

ఈ మేరకు ఏర్పాట్లు సైతం పూర్తి అయినాయి కానీ కోర్టు కేసులు తేలకపోవడంతో అది కాస్తా జూన్, జులై నాటికీ వాయిదా పడింది. ఇదిలా ఉండగా రాజధాని కేసు జులైలో సుప్రీం కోర్ట్ విచారించనున్నందున అది తేలిన తరువాతనే విశాఖ వెళ్లడం సాధ్యం అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ తన విశాఖ పయనాన్ని సెప్టెంబర్ కు ప్లాన్ చేసుకున్నట్లు శ్రీకాకుళం జిల్లాలో పోర్ట్ శంఖుస్థాపన సభలో జగన్ క్లారిటీ ఇచ్చారు.

దువ్వాడ శ్రీనుకు క్లారిటీ

ఇదిలా ఉండగా ఎన్నికలకు సంబంధించి , అభ్యర్థుల విషయంలోనూ జగన్ క్లారిటీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు అవకాశం ఇస్తున్నట్లు ఆయన చెప్పకనే చెప్పారు. నియోజకవర్గంలో నాయకత్వం విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదని అన్నారు. కన్ఫ్యూజన్ ఉంటె పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పిన జగన్ శ్రీనును మీ చేతుల్లో పెడుతున్నాను. మీరే ఆశీర్వదించాలి అని అన్నారు. ఆంటే దువ్వాడ శ్రీనుకు టికెట్ అని అన్యాపదేశంగా చెప్పేసారు.

దువ్వాడ శ్రీను మొదటి నుంచి జగన్ వెంట ఉన్నారు. వైఎస్సార్సీపీ(YSRCP) తరఫున 2014 లో టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత గత 2019 ఎన్నికల్లో అయన శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి టిడిఫై అభ్యర్థి ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. అయినా సరే ఆయనకు జగన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి టెక్కలి ఇంచార్జ్ గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మంచి దూకుడు మీదున్న దువ్వాడ శ్రీనివాస రానున్న ఎన్నికల్లో మళ్ళీ అచ్చెన్న తో తలపడుతున్నారు.