జగన్‌కు తత్వం బోధపడిందా.. ఎమ్మెల్యేలకు బుజ్జగింపు..!
13న లీడర్లతో భేటీ విధాత, సినిమా: అవును రెండు మూడు టెంకి జెల్లలు తగిలితే గానీ పిల్లాడికి బుద్ధి రాదు అన్నట్లుగా వరుసగా నాయకులు అసమ్మతి రాగాలు తీస్తే తప్ప జగన్‌కు తత్వం బోధపడినట్లు లేదు. ఇప్పుడు అందర్నీ బుజ్జగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 13న ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో మాట్లాడేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు తరచుగా జగన్‌ను కలిసేది ఉండదు. ఆయన ఎపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే. అంత సులువుగా దొరకదు. అంతా జై జగన్ […]

- 13న లీడర్లతో భేటీ
విధాత, సినిమా: అవును రెండు మూడు టెంకి జెల్లలు తగిలితే గానీ పిల్లాడికి బుద్ధి రాదు అన్నట్లుగా వరుసగా నాయకులు అసమ్మతి రాగాలు తీస్తే తప్ప జగన్‌కు తత్వం బోధపడినట్లు లేదు. ఇప్పుడు అందర్నీ బుజ్జగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 13న ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో మాట్లాడేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
వాస్తవానికి ఎమ్మెల్యేలు తరచుగా జగన్‌ను కలిసేది ఉండదు. ఆయన ఎపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే. అంత సులువుగా దొరకదు. అంతా జై జగన్ అనే మత్తులో ఉంటారని.. అందరూ తన పేరు మీదనే వెలుస్తారని జగన్ భవిస్తూ వచ్చారు. కార్యకర్తలు.. ఎమ్మెల్యేలు తన గీత దాటరని ఆయనకు ఓ నమ్మకం ఉంటూ వస్తోంది.
అయితే తాజాగా నెల్లూరులో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటివారు ఒకేసారి బహిర్గతమై జగన్‌కు వ్యతిరేకంగా గొంతు విప్పేసరికి పార్టీ ఒక్కసారిగా గతుక్కుమంది. బయటపడిన వాళ్ళు వీరు.. మరి లోలోన రగిలిపోతున్నవారు ఇంకెంతమంది ఉన్నారో అనే సందేహం మొదలైంది.
వైఎస్సార్ ఫ్యామిలీకి వీర విధేయుడు జగన్ భక్తుడైయిన కోటంరెడ్డి వంటివారే ఇలా ఎదురు తిరిగితే మిగతావాళ్ళు ఇంకెలా ఉంటారో అనే సందేహం పార్టీ పెద్దల్లో మొదలైంది. అదే సమయంలో మైలవరం వసంత కృష్ణప్రసాద్ సైతం జగన్ మీద కసిన్ని డైలాగ్స్ విసిరారు. ఈ రాజకీయాలు తనకు సాధ్యం కావడం లేదని నిర్వేదం వ్యక్తం చేశారు.
దీంతో జగన్ వసంత క్రిష్ణ ప్రసాద్ ని జగన్ పిలిపించుకుని చర్చలు జరిపారు అంటే జగన్ లో దిద్దుబాటు మొదలైందని అంటున్నారు. దీంతో ఈ నెల 13న ఎమ్మెల్యేలతో మీటింగ్ తరువాత మరింతగా వారితో భేటీలు పెట్టి ఎక్కడికక్కడ విభేదాలను అసంతృప్తులను లేకుండా చూడడానికి జగన్ నేరుగా రంగంలోకి దిగుతారు అని అంటున్నారు.