CM KCR | సూర్యాపేట‌కు.. రూ. 25 కోట్ల‌తో క‌ళాభార‌తి మంజూరు: సీఎం కేసీఆర్

CM KCR | సూర్యాపేట జిల్లాకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టించారు. జిల్లాలోని గ్రామ‌పంచాయ‌తీలు, మున్సిపాలిటీల‌కు నిధులు మంజూరు చేశారు. సూర్యాపేట‌ను మ‌రింత అభివృద్ధి చేసే దిశ‌గా ముందుకు పోతామ‌ని హామీ ఇచ్చారు కేసీఆర్. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. నూత‌నంగా నిర్మించిన క‌లెక్ట‌రేట్, ఎస్పీ ఆఫీసు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, మెడిక‌ల్ కాలేజీని త‌న చేతులు మీదుగా ప్రారంభించిన సంద‌ర్భంగా సూర్యాపేట ప్ర‌జ‌ల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను […]

  • By: raj    latest    Aug 20, 2023 12:44 PM IST
CM KCR | సూర్యాపేట‌కు.. రూ. 25 కోట్ల‌తో క‌ళాభార‌తి మంజూరు: సీఎం కేసీఆర్

CM KCR |

సూర్యాపేట జిల్లాకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌రాలు ప్ర‌క‌టించారు. జిల్లాలోని గ్రామ‌పంచాయ‌తీలు, మున్సిపాలిటీల‌కు నిధులు మంజూరు చేశారు. సూర్యాపేట‌ను మ‌రింత అభివృద్ధి చేసే దిశ‌గా ముందుకు పోతామ‌ని హామీ ఇచ్చారు కేసీఆర్. సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

నూత‌నంగా నిర్మించిన క‌లెక్ట‌రేట్, ఎస్పీ ఆఫీసు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్, మెడిక‌ల్ కాలేజీని త‌న చేతులు మీదుగా ప్రారంభించిన సంద‌ర్భంగా సూర్యాపేట ప్ర‌జ‌ల‌ను, ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అభినందిస్తున్నాను అని కేసీఆర్ తెలిపారు. మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి కోరిక మేర‌కు.. జిల్లాలో 475 గ్రామ పంచాయ‌తీలు ఉన్నాయి. అభివృద్ధి కోసం త‌ప్ప‌కుండా.. ప్ర‌తి గ్రామ‌పంచాయ‌తీకి 10 ల‌క్ష‌ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం.

కోదాడ‌, హుజుర్ న‌గ‌ర్, తిరుమ‌ల‌గిరి, నేరేడుచ‌ర్ల‌, సూర్యాపేట మున్సిపాలిటీల‌కు కూడా ప్ర‌త్యేక నిధులు మంజూరు చేస్తున్నాం. సూర్యాపేట‌కు క‌ళాభార‌తి ఇవ్వాల‌ని కోరారు. ఇక్క‌డ్నుంచి అద్భుత‌మైన పాట‌లు వెలువ‌డ్డాయి. క‌వులు, క‌విత్వం పుట్టిన వార‌స‌త్వం గ‌డ్డ ఇది. రూ. 25 కోట్ల‌తో క‌ళాభార‌తి మంజూరు చేస్తున్నాం.

సూర్యాపేట‌లో వంద‌ల కొద్ది కొత్త బిల్డింగులు వ‌చ్చాయి. అద్భుత‌మైన అభివృద్ధిలో దూసుకుపోతోంది. సూర్యాపేట పట్ట‌ణం బాగా అభివృద్ధి జ‌ర‌గాలి. కోదాడ‌, హుజుర్ న‌గ‌ర్, తిరుమ‌ల‌గిరి, నేరేడుచ‌ర్ల మున్సిపాలిటీల‌కు రూ. 25 కోట్ల చొప్పున‌, సూర్యాపేట మున్సిపాలిటీకి రూ. 50 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నాం. మ‌హిళా పాలిటెక్నిక్ కాలేజీ మంజూర్ చేస్తాం. స్టేడియం కూడా మంజూరు చేస్తాం. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కూడా మంజూరు చేస్తాం అని కేసీఆర్ ప్ర‌క‌టించారు.