CM KCR | నాకు నాలుక లేదా.. చెప్పరాదా.. పెన్షన్ల పెంపుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
CM KCR | వికలాంగుల పెన్షన్లు పెంచుకున్న మాదిరిగానే.. మిగతా పెన్షన్లు కూడా తప్పకుండా పెంచుకుందాం.. మున్ముందు ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఒక నాడు సూర్యాపేటకు వస్తుంటే.. మిర్యాలగూడలో సభ ఉండే. ఏడు నిమిషాలు మాత్రమే సమయం ఉండే. ఆ సభలో ఒక మాట చెప్పాను. జగదీశ్ రెడ్డిని గెలిపస్తే మంత్రి అయితడు అని చెప్పిన చేశాను. సూర్యాపేటను […]

CM KCR |
వికలాంగుల పెన్షన్లు పెంచుకున్న మాదిరిగానే.. మిగతా పెన్షన్లు కూడా తప్పకుండా పెంచుకుందాం.. మున్ముందు ప్రకటిస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఒక నాడు సూర్యాపేటకు వస్తుంటే.. మిర్యాలగూడలో సభ ఉండే. ఏడు నిమిషాలు మాత్రమే సమయం ఉండే. ఆ సభలో ఒక మాట చెప్పాను. జగదీశ్ రెడ్డిని గెలిపస్తే మంత్రి అయితడు అని చెప్పిన చేశాను. సూర్యాపేటను జిల్లా కూడా చేశాను అని కేసీఆర్ గుర్తు చేశారు. మీకు ఒక్కటే మాట మనవి చేస్తున్నాను. ఎన్నికలు రాగానే వరి కోతలు అయినప్పుడు అడుక్కునే వాళ్లు వచ్చినట్లు.. ఇప్పుడు అలా కొంతమంది నాయకులు బయల్దేరుతారు.
దయచేసి నేను చెప్పే మాటలు ఇక్కడే విడిచిపెట్టి వెళ్లొద్దు. నా మాటపై గ్రామాల్లో పది మందితో చర్చ పెట్టాలి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొత్తవి కావు. ఒక్క అవకాశం ఇవ్వండి అంటున్నారు. 50 ఏండ్ల అవకాశం ఇచ్చారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ జిల్లా నుంచి కూడా మంత్రులు అయ్యారు. సూర్యాపేట, నల్లగొండ, భువనగిరిలో మెడికల్ కాలేజీ పెట్టాలని ఆలోచన చేశారా? వాళ్లకు మళ్లా ఎందుకు ఓటేయ్యాలి. ఇవాళ నల్లగొండ పట్టణానికి వెళ్తే.. అద్భుతంగా కనబడుతుంది.
మునపటి కంటే అద్భుతంగా తీర్చిదిద్దాం. మరి పఈ పనిని నాడు ఎందుకు చేయలేదు. కాంగ్రెస్ హయాంలో రైతాంగం చనిపోతుంటే.. ఆపద్భాందు డబ్బులు రాకపోయేవి. ఆపద్భాందు కింద రావాల్సిన రూ. 50 వేలు వచ్చేటివి కావు. ఆర్నెళ్లు తిరిగితే పది వేలు ఇరవై వేలే ఇచ్చి పంపేటోళ్లు. రైతుల గురించి ఆలోచించలేదు. ఆఫీసుల ముందుకు వెళ్తే తరిమికొట్టారు. ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు. మనకు కులం, మతం, జాతి లేదు. అందర్నీ కడుపులో పెట్టుకుని ఏ ఒక్కరిని కూడా విస్మరించుకుండా కాపాడుకుంటూ ముందుకు పోతున్నాం అని కేసీఆర్ తెలిపారు.
కల్యాణలక్ష్మి మొదట్లో 51 వేలు పెట్టుకున్నాం. ఆ తర్వాత లక్షా పదహారు వేలు చేసుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు. పెన్షన్లు కూడా క్రమక్రమంగా పెంచుకున్నాం. 50 ఏండ్ల కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది. వారి జన్మల 500 పెన్షన్ కూడా ఇవ్వలేదు. కేవలం 200 ఇచ్చిన వారు.. ఇప్పుడు చాన్స్ ఇస్తే 4 వేలు ఇస్తాం అంటున్నారు.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో ఇస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికో నీతి ఉంటుందా..? ఓటు గుంజుకుని గుద్దితే.. ఉన్నది పోతది.. ఉంచుకున్నది పోతది. నాకు చెప్పరాదా.. నాలుక లేదా.. వాడు నాలుగు ఇస్త అంటే నేను ఐదు ఇస్త అని చెప్పలేనా.. బాధ్యతతో ముందుకు వెళ్లాలి. తప్పకుండా పెన్షన్లు పెంచుదాం. మున్ముందు ప్రకటిస్తాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.