CM KCR సార్.. సానుకూలంగా స్పందించండి
CM KCR విధాత: జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సర్వీస్ క్రమబద్ధీకరించాలని కోరుతూ.. 12 రోజులుగా సమ్మె బాట పట్టారు. అయితే వీరి విజ్ఞప్తి స్పందించాల్సిన ప్రభుత్వం నిన్న ఒక నోటీసులు జారీచేసింది. ఒప్పందం, బాండ్ నిబంధనలకు విరుద్ధంగా యూనియన్ ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం ఆక్షేపించింది. అయితే ఉద్యమపార్టీగా మొదలైన బీఆర్‌ఎస్ రాజకీయపార్టీగా మారింది. రాష్ట్ర సాధన కోసం పద్నాలుగేళ్లు సుదీర్ఘ ఉద్యమం చేశామని ఆ పార్టీ నాయకులే చెబుతుంటారు. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాన్ని […]

CM KCR
విధాత: జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ సర్వీస్ క్రమబద్ధీకరించాలని కోరుతూ.. 12 రోజులుగా సమ్మె బాట పట్టారు. అయితే వీరి విజ్ఞప్తి స్పందించాల్సిన ప్రభుత్వం నిన్న ఒక నోటీసులు జారీచేసింది. ఒప్పందం, బాండ్ నిబంధనలకు విరుద్ధంగా యూనియన్ ఏర్పాటు చేయడాన్ని ప్రభుత్వం ఆక్షేపించింది.
అయితే ఉద్యమపార్టీగా మొదలైన బీఆర్‌ఎస్ రాజకీయపార్టీగా మారింది. రాష్ట్ర సాధన కోసం పద్నాలుగేళ్లు సుదీర్ఘ ఉద్యమం చేశామని ఆ పార్టీ నాయకులే చెబుతుంటారు. నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయలేదు.
ఎందుకంటే శాంతియుతంగా చేపట్టే నిరసనను అడ్డుకోవడం సరికాదని వారి భావన. రాష్ట్ర ఏర్పాటు అన్నది ఒక రాజకీయ నిర్ణయంతో ముడిపడి ఉండటంతో ఉద్యమకారుల ఉద్యమాన్ని, నిరసనలను అడ్డుకున్నా అంతిమంగా ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్నది.
సంకీర్ణ ప్రభుత్వాల హయాంలోనూ నాటి యూపీఏ ప్రభుత్వం ఒక సంక్లిష్ల సమస్యను పరిష్కరించింది. ఇది సోనియాగాంధీ సంకల్పం వల్లనే సాధ్యమైందని సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో అంగీకరించారు. మరి స్వరాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదని, నిరసనలు చేపట్టకూడదని, యూనియన్లు ఏర్పాటు చేయడకూడదన్నట్టు బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరి ఉండటం శోచనీయం.
ఇవాళ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు వస్తున్నాయంటే అక్కడి స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శల కృషి ఫలితమే కదా. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అహర్నిశలు కష్టపడుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ క్రమబద్ధీకరణ విషయంలోనూ సీఎం సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం గతంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ కఠినంగా వ్యవహరించినా చివరికి మంచి నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలయ్యేలా పనిచేస్తున్న కారదర్శుల సర్వీసుల క్రమబద్ధీకరణ విషయంలోనూ త్వరగా నిర్ణయం తీసుకోవాలి. సమ్మెలో ఉన్న జేపీఎస్‌లు తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదంటున్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక మెట్టు దిగాలి. వారి ఆవేదనను అర్థం చేసుకోవాలి.
అసెంబ్లీ వేదికగా సీఎం వారికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. సమ్మెలో ఉన్న కార్యదర్శులకు వారు పనిచేస్తున్న గ్రామాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులు సంఘీభావం ప్రకటించడాన్నిప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రతిపక్షాల కూడా వారి పోరాటానికి అండగా ఉన్నాయి. ప్రభుత్వం జేపీఎస్‌ల డిమాండ్లపై అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకో.. లేదా మరో పార్టీకో వెళ్తుందనే ఆలోచన ఉంటే అది సరికాదు. ప్రజాసమస్యలు, తమ హక్కులు, డిమాండ్ల కోసం పోరాడుతున్న ఉద్యోగులకు అండగా ఉండటం ప్రతిపక్షాల బాధ్యత.
ప్రభుత్వం ఈ విషయంలో ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకుని జేపీఎస్‌ల న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు కోరుతున్నారు. సీఎం గారు దీనిపై సానుకూలంగా స్పందించాలంటున్నారు.