ఆ గౌరవం పాలమూరుకే దక్కుతుంది : సీఎం కేసీఆర్
CM KCR | తెలంగాణ రాష్ట్రాన్ని పాలమూరు ఎంపీగా ఉంటూ సాధించాను. ఆ గౌరవం పాలమూరుకే దక్కుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ రోజు మహబూబ్‌నగర్‌లో అద్భుతమైనటువంటి కలెక్టరేట్ భవనాన్ని నిర్మించుకుని నా చేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలందరినీ అభినందిస్తున్నాను. పరిపాలన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుని కొత్త కలెక్టరేట్‌లను […]

CM KCR | తెలంగాణ రాష్ట్రాన్ని పాలమూరు ఎంపీగా ఉంటూ సాధించాను. ఆ గౌరవం పాలమూరుకే దక్కుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ రోజు మహబూబ్‌నగర్‌లో అద్భుతమైనటువంటి కలెక్టరేట్ భవనాన్ని నిర్మించుకుని నా చేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రజలందరినీ అభినందిస్తున్నాను. పరిపాలన సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకుని కొత్త కలెక్టరేట్‌లను నిర్మాణం చేసుకుంటున్నాం. ఇంత గొప్పగా చేయగలుగుతున్నామంటే మన రాష్ట్రం సాధించుకున్నాం కాబట్టి ఇవన్నీ మనం చేసుకోగలుగుతున్నాం. అన్నింటిని మించి తెలంగాణ ఉద్యమం రెండో దఫా ప్రారంభమై కొనసాగే సందర్భంలో పాలమూరు ఎంపీగా ఉంటూ రాష్ట్రాన్ని సాధించను. ఏనాటికైనా ఆ గౌరవం పాలమూరు జిల్లాకే దక్కుతుంది. ఉద్యమ సందర్భంలో పాలమూరు జిల్లాకు వస్తే వేదనలు, రోదనలు, బాధలు, చాలా భయంకరమైన దుస్థితి. అనేక బాధలు, ఆత్మహత్యలు, గంజి కేంద్రాలు. ఒక భయంకరమైన కరువు జిల్లా.
ఎన్నో కలలు కని పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నాం. వాటి ఫలితాలు మన ముందు ఉన్నాయి. దళిత బంధు శ్రీకారం చుట్టినప్పుడు పాటలు రాయమని మన గోరటి వెంకన్నతో పాటు పలువురికి చెప్పాను. పల్లెల్లో పల్లెర్లు మాయం అయ్యాయి. బొంబాయి బస్సులు బంద్ అయినయి. వలసలు ఆగిపోయినయి. వలసలతో వలవల విలపించు పాలమూరు పెఇండింగ్ ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేసి, చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది అని చెప్పి పాటలు రాయమని చెప్పాను.
సమైక్య పాలకులు నిరాధారణకు గురి చేశారు. అందరం కలిసి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేశాం. చెరవులను బాగు చేసుకున్నాం. వాగులపై చెక్ డ్యాంలు కట్టుకున్నాం. ఇవాళ పాలమూరు కరువు జిల్లా కాదు.. పచ్చని పంటల జిల్లా అని పేరు వస్తుంది. మహబూబ్‌నగర్ చాలా బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారు. ఒకే ఒక్క ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్రం సహకరించడం లేదు. కేంద్రం నీటి వాటా తేల్చడం లేదు. 25 నుంచి 30 లక్షల ఎకరాల్లో పంటలు పండబోతున్నాయి. అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. సంక్షేమంలో మనకు సాటి పోటీ లేరు. జాతి, వర్గం లింగ బేధం లేకుండా ముందుకు పోతున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.