MEDAK | 19న మెదక్‌కు CM KCR.. నూతన కలెక్టరేట్, ఎస్పీ, BRS కార్యాలయాల ప్రారంభం
MEDAK | విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లాలో CM KCR పర్యటన ఖరారైంది. నూతనంగా మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయం, ెస్పీ కార్యలయాల సముదాయాన్ని CM KCR ప్రారంభించ నున్నారు. అదేవిధంగా నూతన కలెక్టరేట్ ఎదుట నిర్మించిన జిల్లా BRS పార్టీ కార్యాలయాన్ని సహితం సీఎం ప్రారంభించనున్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలసి పరిశీలించారు. నిర్మాణ పనులను […]

MEDAK |
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ జిల్లాలో CM KCR పర్యటన ఖరారైంది. నూతనంగా మెదక్ జిల్లా కేంద్రంలో నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయం, ెస్పీ కార్యలయాల సముదాయాన్ని CM KCR ప్రారంభించ నున్నారు. అదేవిధంగా నూతన కలెక్టరేట్ ఎదుట నిర్మించిన జిల్లా BRS పార్టీ కార్యాలయాన్ని సహితం సీఎం ప్రారంభించనున్నారు.
ఇటీవల మంత్రి హరీశ్‌రావు నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలసి పరిశీలించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మెదక్క్‌లో బహిరంగ సభ నిర్వహించనున్నారు.