CM KCR 70వ జన్మదినం.. 70 కేజీల భారీ కేక్ కట్ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి
అంతటా జోరుగా సేవా కార్యక్రమాలు విధాత: ప్రతిక్షణం ప్రజల గురించి పరితపించే ప్రజాభిమాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని సూర్యాపేట శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయం అవరణలో బర్త్ డే వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి ఘనంగా నిర్వహించారు. ముందుగా దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆయా మతాలకు చెందిన […]

- అంతటా జోరుగా సేవా కార్యక్రమాలు
విధాత: ప్రతిక్షణం ప్రజల గురించి పరితపించే ప్రజాభిమాని ముఖ్యమంత్రి కేసీఆర్ అని సూర్యాపేట శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదినం సందర్భంగా సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయం అవరణలో బర్త్ డే వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మంత్రి ఘనంగా నిర్వహించారు. ముందుగా దేశ ప్రజలకు తెలంగాణ తరహా పాలన అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆయా మతాలకు చెందిన పెద్దలు ప్రార్దనలు నిర్వహించారు.
అనంతరం 70 కేజీల భారీ కేక్‌ను కట్ చేసిన మంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. పేదలకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా అధునాతన వసతులతో కూడిన అంబులెన్స్‌ను మంత్రి ప్రారంభించారు.
గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా వికలాంగులకు ట్రై మోటార్ సైకిళ్ళను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో కేసీఆర్‌కు అత్యంత ప్రీతికరమైన హరితహరం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మొక్కలు నాటి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. అలుపెరుగని పోరాట యోధుడైన సీఎం కేసీఆర్
అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
అనితర సాధ్యమైన విజయాలను, సంక్షేమ పథకాలను తనదైన పద్దతుల్లో ప్రజలకు చేరువ చేసిన గొప్ప పరిపాలన దక్షకుడని అన్నారు.
తెచ్చిన రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా తయారు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు. సంక్షేమం – అభివృద్ధి ని సమపాళ్లలో ముందుకు తీసుకెలుతూ దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్న కేసీఆర్ పాలన కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
తెలంగాణ తరహా అభివవృద్ధి కోసం దేశ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ల నుండి పుట్టిందే బీఆర్ఎస్ అన్నారు. దేశాన్ని పాలించే విధంగా కేసీఆర్ కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని జిల్లా వ్యాప్తంగా ప్రజలు పూజలు , సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు.
కేసీఆర్ దేశ ప్రజలకు సేవ చేయాలనేదే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్గొండలో నిర్వహించిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి స్థానిక ఛాయ సోమేశ్వర ఆలయంలో ఆయుష్ హోమంలో పాల్గొన్నారు.
పోటాపొటీగా సంబురాలు నిర్వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశవహులు
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో గ్రామాల్లో బిఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ జన్మదిన వేడుకల నిర్వహణలో సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులు ఎవరికి వారు పోటాపోటీగా సందడి చేశారు.
పార్టీ శ్రేణులు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, కేకులు కట్ చేసి ,ఆసుపత్రుల్లో అనాధ, వృద్ధ ఆశ్రమాల్లో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేయడంతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించారు.
సిఎం బర్త్ డే సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన మంత్రి.
ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులతో అంబులెన్స్ ను ప్రారంభించిన మంత్రి, గిఫ్ట్ ఏ స్మైల్ పేరుతో వికలాంగులకు ట్రై మోటార్ సైకిళ్ళు పంపిణీ, కలెక్టర్ కార్యాలయంలో హరిత హరం లో బాగంగా మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి. pic.twitter.com/4f1vpKZ2dL
— Jagadish Reddy G (@jagadishBRS) February 17, 2023