రాములోరిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూజలు చేశారు

రాములోరిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

విధాత: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, కొండా సురేఖ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్‌ కూడా ముఖ్యమంత్రితో కలిసి సీతా సమేత రామచంద్ర స్వామికి పూజలు చేశారు.

అంతకుముందు ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి, మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆలయం లోపలికి వెళ్లిన సీఎం, మంత్రులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు.