CM Siddaramaiah | బీజేపీ ప్రభుత్వం నీచమైనది.. కర్ణాటక సీఎం ధ్వజం
CM Siddaramaiah | విధాత: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం నీచమైనది అని విమర్శించారు. పేదలకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నభాగ్య స్కీం కింద అదనంగా 5 కిలోల చొప్పున ప్రతి లబ్దిదారుడికి రేషన్ బియ్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. తిరస్కరించిందని సీఎం సిద్ధరామయ్య గుర్తు చేశారు. గతంలో నేను […]

CM Siddaramaiah | విధాత: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం నీచమైనది అని విమర్శించారు. పేదలకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నభాగ్య స్కీం కింద అదనంగా 5 కిలోల చొప్పున ప్రతి లబ్దిదారుడికి రేషన్ బియ్యం ఇవ్వాలని కేంద్రాన్ని కోరితే.. తిరస్కరించిందని సీఎం సిద్ధరామయ్య గుర్తు చేశారు.
గతంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి లబ్ధిదారుడికి ఉచితంగా 7 కిలోల బియ్యాన్ని అందించామని తెలిపారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు కేజీలకు తగ్గించిందన్నారు. ప్రతి లబ్దిదారుడికి మరో 5 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు వాగ్దానం ఇచ్చామన్నారు. ఇందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా జరిగిందన్నారు.
కర్ణాటకకు కచ్చితంగా బియ్యం విక్రయిస్తామని ఎఫ్‌సీఐ కూడా హామీ ఇచ్చింది. కానీ కేంద్రం మాత్రం అడ్డు పడుతుందన్నారు. తాము బియ్యాన్ని ఉచితంగా ఇవ్వమని అడగడం లేదు.. అందుకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పేద ప్రజల కడుపు కొడుతున్న బీజేపీ ప్రభుత్వం నీచమైనది అని సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రభుత్వానికి పేదల పట్ల మానవత్వం లేదన్నారు.