నల్లగొండ: రేపు యాదాద్రి థర్మల్ ప్లాంట్ పరిశీలనకు సీఎం రాక !
విధాత: సీఎం కేసీఆర్ రేపు అంటే సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ పనుల పరిశీలనకు రానున్నారు. 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో 4272 ఎకరాల్లో రూ.29965.68 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యాదాద్రి ధర్మల్ ప్లాంట్ పనులు 62శాతం పైగా పూర్తయ్యాయి. 2015 జూన్ 8న సీఎం కేసీఆర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. 2017 అక్టోబర్ 17న నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్లాంట్ నిర్మాణానికి తొలి అంచనా వ్యయం రూ.25099 […]

విధాత: సీఎం కేసీఆర్ రేపు అంటే సోమవారం నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ పనుల పరిశీలనకు రానున్నారు. 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో 4272 ఎకరాల్లో రూ.29965.68 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యాదాద్రి ధర్మల్ ప్లాంట్ పనులు 62శాతం పైగా పూర్తయ్యాయి.
2015 జూన్ 8న సీఎం కేసీఆర్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. 2017 అక్టోబర్ 17న నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్లాంట్ నిర్మాణానికి తొలి అంచనా వ్యయం రూ.25099 కోట్లు కాగా అదనంగా పెరిగి రూ.29, 965.68కోట్లకు చేరుకోవడం గమనార్హం.
ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ ఈ థర్మల్ ప్లాంట్ కి ఇచ్చిన అనుమతులపై పునః పరిశీలన చేయాలని రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ థర్మల్ ప్లాంట్ ను సందర్శించడం ఆసక్తికరంగా మారింది.