అక్కడ కృష్ణమ్మ పరుగులు.. ఎస్‌ఎల్బీసీ సొరంగాల్లో సాగని పనులు

పొరుగు రాష్ట్రం ఏపీలో రెండు దశాబ్దాల స్వప్నం సాకా­రమై వెలి­గొండ (పూల సుబ్బయ్య) ప్రాజె­క్టుకు బుధ­వారం ప్రారం­భో­త్సవ వేడుక జరి­గిన వేళ తెలం­గా­ణలో ఎస్‌­ఎ­ల్బీసీ (శ్రీశైలం ఎడ­మ­గట్టు కాలువ) సొరంగం ప్రాజెక్టు పనులు మరో­సారి ఉమ్మడి నల్ల­గొండ, మహ­బూ­బ్‌­న­గర్‌ జిల్లా వాసు­లలో చర్చ­నీ­యాం­శమయ్యాయి.

అక్కడ కృష్ణమ్మ పరుగులు.. ఎస్‌ఎల్బీసీ సొరంగాల్లో సాగని పనులు
  • ఇక్కడ కొనసొ..గుతున్న పనులు
  • వెలి­గొండ సొరం­గాల్లో దుంకిన కృష్ణమ్మ
  • ఎస్‌­ఎ­ల్బీసీ సొరం­గాల్లో అదే జాప్యం
  • పనులు పూర్త­యితే శ్రీశైలం నుంచి
  • 30 టీఎం­సీల జలాలు గ్రావి­టీతో
  • నల్ల­గొండ, పాల­మూ­రుకు పరు­గులు
  • మరో 2వేల కోట్లతో పూర్తయ్యే అవ­కాశం
  • కాంగ్రెస్ ప్రభు­త్వం­పైనే రైతుల ఆశలు

(విధాత ప్రత్యేకం)

పొరుగు రాష్ట్రం ఏపీలో రెండు దశాబ్దాల స్వప్నం సాకా­రమై వెలి­గొండ (పూల సుబ్బయ్య) ప్రాజె­క్టుకు బుధ­వారం ప్రారం­భో­త్సవ వేడుక జరి­గిన వేళ తెలం­గా­ణలో ఎస్‌­ఎ­ల్బీసీ (శ్రీశైలం ఎడ­మ­గట్టు కాలువ) సొరంగం ప్రాజెక్టు పనులు మరో­సారి ఉమ్మడి నల్ల­గొండ, మహ­బూ­బ్‌­న­గర్‌ జిల్లా వాసు­లలో చర్చ­నీ­యాం­శమయ్యాయి. 10,010 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శ్రీశైలం ప్రాజెక్టు రిజ­ర్వా­యర్ బ్యాక్ వాటర్ నుంచి 43.5 టీఎం­సీల కృష్ణా జలా­లను ప్రకాశం, వైఎ­స్సార్‌, ఎస్పీ­ఎస్ పొట్టి శ్రీరా­ములు జిల్లా­ల్లోని 3.28 లక్షల ఎక­రా­లకు అందిం­చేం­దుకు, 11.25 లక్షల మందికి తాగు­నీ­టిని అందిం­చేం­దుకు చేప­ట్టిన వెలి­గొండ ప్రాజెక్టు రెండు టన్నెళ్లు పూర్త­వ్వ­డంతో ఏపీ సీఎం జగన్ వాటిని ప్రారం­భిం­చారు. టన్నెల్ 1, 2 కలిపి 37.587 కిలో­మీ­టర్ల తవ్వ­కాలు పూర్తి చేసి, శ్రీశైలం బ్యాక్ వాటర్ సద్వి­ని­యో­గంలో ఏపీ కీలక విజయం సాధిం­చింది. తెలం­గా­ణలో ఇదే శ్రీశైలం జలా­శయం బ్యాక్ వాటర్‌ తర­లిం­పుతో కరువు, ఫ్లోరైడ్ పీడిత ఉమ్మడి నల్ల­గొండ, మహ­బూ­బ్‌­న­గర్ జిల్లా­లకు తాగు­, సా­గు ­నీ­రం­దించే లక్ష్యంతో చేప­ట్టిన ఎస్‌­ఎ­ల్బీసీ సొరంగ ప్రాజెక్టు రెండు దశాబ్దాలుగా అసం­పూ­ర్తి­గానే మిగి­లి­వుం­డటం ఇక్కడి పాల­కుల చిత్త­శు­ద్ధిని ప్రశ్నిస్తున్నది.

రెండింటి పనులు ఒకేసారి తలపెట్టినవి

అటు వెలి­గొండ, ఇటు ఎస్‌­ఎ­ల్బీసీ రెండు కూడా అభ­యా­ర­ణ్యల పరి­ధి­లోనే, సొరం­గాల నిర్మా­ణా­ల­తోనే శ్రీశైలం బ్యాక్ వాటర్ పైనే ఆధారపడినవి. దాదా­పుగా ఒకే సమ­యంలో తల­పె­ట్టిన ప్రాజె­క్టులు. వైఎ­స్సార్ ప్రభుత్వం హయాం­లోనే 2004లో వెలి­గొండ, 2005లో ఎస్‌­ఎ­ల్బీసీ ప్రాజె­క్టుల నిర్మా­ణా­లకు నెలల వ్యవ­ధిలో పరి­పా­లన అను­మ­తు­లి­చ్చారు. ఎస్‌­ఎ­ల్బీసీ ద్వారా 30టీఎం­సీల కృష్ణా జలా­లను శ్రీశైలం జలా­శయం నుంచి తీసు­కుని నల్ల­గొండ జిల్లాలో 3లక్షల ఎక­రాలు, మహ­బూ­బ్‌­న­గర్ జిల్లాలో 50వేల ఎక­రా­లకు సాగు­నీరు అందిం­చ­డంతో పాటు 600కుపైగా గ్రామా­లకు తాగు­నీరు అందిం­చా­లని నిర్ణ­యిం­చారు. వెలి­గొండ కాంట్రాక్టు సంస్థ మెగా కన్‌స్ట్రక్షన్స్‌కు ఏపీలో అధి­కా­రంలో ఏ పార్టీ ప్రభు­త్వాలు ఉన్నా సహకారం అందించాయి. దీంతో వెలి­గొండ ప్రాజెక్టు టన్నె­ళ్లను ఆ సంస్థ పూర్తి చేసింది. ఇక్కడ జయ­ప్ర­కాశ్ అసో­సి­యేట్స్ 1,925 కోట్లతో కాంట్రాక్టు చేప­ట్టి­న­ప్ప­టికీ ప్రభు­త్వాల నుంచి సక్ర­మంగా అందని నిధులు.. టన్నెల్ బోరింగ్ మిషన్లు, వర­దలు, సీపేజీ వాటర్‌ సమ­స్య­లతో నేటికీ సొరం­గాలు తవ్వ­లే­క­పో­యింది.

మధ్యలో సొరంగం పనులు ఆల­స్య­మ­వు­తా­యన్న ఉద్దేశంతో ఎలి­మి­నేటి మాధ­వ­రెడ్డి ఎత్తి­పో­తల ప్రాజెక్టు నిర్మించి నాగా­ర్జున సాగర్‌ పుట్టం­గండి నుంచి ఎత్తి­పో­త­లతో ఎగువ కాలువ ద్వారా 2.20లక్షల ఎక­రా­లకు, దిగువ కాలువ ద్వారా 80వేల ఎక­రా­లకు నీరం­దించడంతోపాటు ఉమ్మడి నల్ల­గొండ జిల్లాని 600 గ్రామా­లు, హైద­రా­బా­ద్‌కు తాగు­నీటి సర­ఫరా చేప­ట్టారు. స్వరాష్ట్రం తెలం­గా­ణలో ఎస్‌­ఎ­ల్బీసీ కట్టపై కుర్చీ వేసు­కుని మరి సొరంగం పూర్తిచేయిస్తానని చెప్పిన కేసీ­ఆర్.. పదే­ళ్లలో ఈ ప్రాజె­క్టును పడ­కే­యించి, కాళే­శ్వరం ప్రాజె­క్టుకు నిధు­లను మళ్లించారన్న విమర్శలు ఉన్నాయి. ఎస్సెల్బీసీ సొరంగం ప్రాజెక్టుకోసం ఉమ్మడి నల్ల­గొండ జిల్లా ప్రజలు, ఫ్లోరైడ్ విముక్తి పోరాట సమితి, జల సాధన సమి­తులతో పాటు జిల్లా రాజ­కీయ పక్షాల ఆధ్వ­ర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు సాగాయి. 1996 పార్ల­మెంటు ఎన్ని­కల్లో రికార్డు స్థాయిలో 537 నామి­నే­ష­న్లతో 480 మంది (ఆరు­గురు రాజ­కీయ పార్టీల వారు) అభ్య­ర్థుల బ్యాలె­ట్‌ పోరాటంతో ఈ ప్రాజెక్టును సాధించుకున్నారు. కానీ.. రెండు దశాబ్దాలు గడి­చినా జిల్లా వాసు­లకు అందు­బా­టు­లోకి రాక­పో­వడం దుర­దృ­ష్ట­క­రమే.

సాగుతూ ఆగుతూ నత్త­న­డ­కన ఎస్‌­ఎ­ల్బీసీ సొరంగం పనులకు

1983లోనే 480 కోట్ల వ్యయంతో బీజం పడింది. దివం­గత సీఎం వైఎ­స్సార్ 2,813 కోట్ల అంచనా వ్యయంతో 147జీవో ద్వారా 2005 ఆగస్టు 11న పరి­పా­లన ఆమో­దంతో ప్రాణం పోశారు. మెస్సర్ జయ­ప్ర­కాశ్ అసో­సి­యేట్స్ సంస్థ 1925 కోట్లతో టెండర్ దక్కించుకున్నది. వర­దల కార­ణంగా ఆగిన పనులు 2007లో తిరిగి మొదలయ్యాయి. నాలు­గే­ళ్లలో పూర్తి కావా­ల్సిన పనులు అప్పటి నుంచి ఆగుతూ సాగుతున్నాయి. శ్రీశైలం నుంచి తీసు­కునే 13.9 కిలో­మీ­టర్ల ఇన్‌­లెట్ సొరంగం తవ్వకం పనులు పూర్తి­కాగా, నీళ్లు బయ­టకు వచ్చే అవుట్ లెట్ నుంచి 20.4 కిలోమీటర్లు తవ్వారు. మధ్యలో 9.6 కిలో­మీ­టర్ల సొరంగం తవ్వా­ల్సి­వుంది. నిర్మాణ వ్యయం 4,600 కోట్లకు పెరి­గింది. ఈ ప్రాజె­క్టులో ఇప్ప­టి­వ­రకు 2,700 కోట్ల ఖర్చు చేయగా, చేసి­న­ ప­నుల్లో కాంట్రా­క్ట­ర్‌కు 50 కోట్ల బిల్లులు పెండిం­గ్‌లో ఉన్నాయి. 59 కోట్ల రూపాయల మేర విద్యుత్తు బిల్లులు చెల్లిం­చా­ల్సి­వుంది. మిగి­లిన సొరంగం పను­లతో పాటు ఇతర పనుల పూర్తి కోసం మరో 2,200 కోట్లు అవ­స­ర­మని ఇరి­గే­షన్ నిపు­ణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇన్‌­లెట్ వైపు టీబీఎం మిషన్ శ్రీశైలం జలా­శయం వైపు నుంచి వస్తున్న సీపేజీ నీటిలో మునిగి మూడే­ళ్ల­య్యింది. నీటిని తొల­గించి టీబీఎం మిషన్ పరి­క­రా­లను వేరు చేసి, రిపేర్లు చేయిం­చేం­దుకు ఆరు­నె­ల­లుగా ప్రయ­త్ని­స్తు­న్నారు. అవుట్‌లెట్‌ వైపు టీబీఎం చెడి­పో­యిన మిషన్ స్థానంలో కొత్తది అమ­ర్చ­డంలో మూడేళ్ల కాలం వృథా అయి­పో­యింది. తీరా కొత్త టీబీ­ఎంతో ఒక­టి­న్నర కిలో­మీ­టర్‌ తవ్వ­గానే అది­కూడా చెడి­పో­యింది. దాని కోసం మళ్లీ ఆర్డర్ చేసినా ఇప్ప­టి­దాకా అతీ­గతీ లేదు.

ప్రాజె­క్టుల ఆల­స్యంతో కృష్ణా జలా­లకు గండి

కృష్ణా నదిపై తెలం­గాణ ప్రభుత్వం చేప­ట్టిన ఎస్‌­ఎ­ల్బీసీ, అందులో అంత­ర్భా­గ­మైన ఉదయ సముద్రం ఎత్తి­పో­తల, పాల­మూ­రు­, రం­గా­రెడ్డి, అందులో అంత­ర్భా­గ­మైన డిండి ఎత్తి­పో­తల పథ­కాల నిర్మా­ణంలో జాప్యంతో శ్రీశైలం జలా­శయం నుంచి కృష్ణా జలాల తర­లిం­పులో తెలం­గాణ విఫలమైంది. ఇదే సమ­యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్ నుంచి పోతి­రె­డ్డి­పాడు హెడ్ రెగ్యు­లే­ట­రీని ద్వారా రోజుకు మూడు టీఎం­సీల తర­లింపు సామర్థ్యాన్ని ఏడు టీఎం­సీ­లకు పెంచే పనులు చేప­ట్టింది. రాయ­ల­సీ­మ­లోని కర్నూలు మాత్రమే కృష్ణా బేసి­న్‌­లోకి వస్తుం­డగా, శ్రీశైలం నీళ్లను రాయ­ల­సీ­మతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లా­లకు తర­లిస్తారు. అదీ­గాక శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎం­సీ­లను లిఫ్ట్‌ చేసే సంగ­మే­శ్వరం (రాయ­ల­సీమ) ఎత్తి­పో­తల పనులు కొన­సా­గి­స్తున్నది. ఇప్ప­టికే హంద్రీ­నీవా సుజల స్రవంతి, ముచ్చుమర్రి ఎత్తి­పో­తల, వెలి­గొండ ప్రాజె­క్టుల ద్వారా ఏపీ అద­నంగా రోజుకు రెండు టీఎం­సీ­లను తర­లిం­చు­కు­పో­తున్నది. కృష్ణా ప్రాజె­క్టు­లను ఏపీ ప్రభు­త్వాలు వేగంగా పూర్తి చేసు­కుని నీళ్లు తర­లిం­చు­కు­వె­ళు­తుంటే తెలం­గాణ ప్రభు­త్వాలు నత్త­న­డ­కన ప్రాజె­క్టుల నిర్మా­ణాలు చేస్తూ ఈ ప్రాంత ప్రజల, రైతుల సహ­నా­నికి పరీక్ష పెడు­తు­న్నా­యన్న విమ­ర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్ ప్రభు­త్వం­పైనే ఆశలు

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు­త్వాలు చేప­ట్టిన సాగు­నీటి ప్రాజె­క్టు­లను తెలం­గా­ణలో గత బీఆ­రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయగా, మళ్లీ కొత్తగా తెలం­గా­ణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావ­డంతో పెండింగ్ ప్రాజె­క్టుల పనులు పూర్త­వు­తా­యన్న ఆశలు ప్రజల్లో చిగు­రిం­చాయి. సదరు ప్రాజె­క్టు­లను పూర్తి చేస్తా­మని కాంగ్రెస్ ఎన్ని­కల్లో హామీ­లి­వ్వ­డంతో ఈ దిశగా ముంద­డుగు పడు­తుందన్న ఆశతో ప్రజలు ఉన్నారు. ఇప్ప­టికే ఎస్‌­ఎ­ల్బీసీ సొరంగం ప్రాజె­క్టుపై ఫిబ్ర­వరి 22న సమీక్ష చేసిన మంత్రులు ఉత్త­మ్‌­కు­మా­ర్‌­రెడ్డి, కోమ­టి­రెడ్డి వెంక­ట్‌­రె­డ్డి.. రెండే­ళ్లలో ఎస్‌­ఎ­ల్బీసీ సహా ఉమ్మడి నల్ల­గొం­డ­లోని డిండి ఎత్తి­పో­తల ప్రాజె­క్టును పూర్తి చేయా­లని అధి­కా­రు­లకు నిర్దేశించారు. 44 కిలో­మీ­టర్ల ఎస్‌­ఎ­ల్బీసీ సొరం­గంలో మిగి­లిన 9 కిలో­మీ­టర్ల పనులు రెండు­వై­పుల చేపట్టి వీలై­నంత త్వరగా పూర్తి చేయా­లని ఆదే­శిం­చారు. పను­లకు సంబం­ధించి వారా­ని­కి­కొకసారి సమీక్ష చేయా­లని, సాంకే­తిక సమ­స్య­లపై ఓ కమిటీ వేయా­లని ఆదే­శిం­చ­డంతో ప్రాజెక్టు పనుల పురో­గ­తిపై ప్రజల్లో విశ్వాసం కలుగుతున్నది.