Nalgonda | కూలిన ఉదయ సముద్రం ఎత్తిపోతల కల్వర్టు వాల్స్.. ప్రమాదకరంగా రాకపోకలు
Nalgonda | విధాత: నల్లగొండ జిల్లా పానగల్ ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం కింద ఉన్నటువంటి కెనాల్ రోడ్డు కల్వర్టు వాల్స్ కూలి కెనాల్ లో పడిపోయాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. మెగా ఇంజనీర్స్ కంపెనీ వారు నిర్మించిన ఈ పనిలో దండంపల్లి గ్రామం వద్ద కాలువ కల్వర్టు సీసి పనులు నాసిరకంగా ఉండటంతో రోడ్డు సగం మేరకు కాలువలోకి […]

Nalgonda |
విధాత: నల్లగొండ జిల్లా పానగల్ ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం కింద ఉన్నటువంటి కెనాల్ రోడ్డు కల్వర్టు వాల్స్ కూలి కెనాల్ లో పడిపోయాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు.
మెగా ఇంజనీర్స్ కంపెనీ వారు నిర్మించిన ఈ పనిలో దండంపల్లి గ్రామం వద్ద కాలువ కల్వర్టు సీసి పనులు నాసిరకంగా ఉండటంతో రోడ్డు సగం మేరకు కాలువలోకి కొట్టుకపోయింది. అంతేకాకుండా పానగల్ వాటర్ ప్లాంట్ నుండి సూర్యాపేట, భువనగిరి యాదాద్రి జిల్లాలలోని కొన్ని మండలాలకు మంచినీరు అందించే పైప్ లైన్ కూడా దానితో పాటు అందులోనే కూలిపోయింది.
ఈ ఘటనను దండంపల్లి గ్రామపంచాయతీ వాస్తవ్యులు గోలి సైదులు సంబంధిత శాఖ సూపరిండెంట్ ఆఫ్ ఇంజనీర్ దృష్టికి తీసుకెళ్లారు. అది నాసిరకంతో చేసిన గోడ నిర్మాణమని, ఇప్పుడు మళ్లీ గట్టి పునాది వేసి కొత్త నిర్మాణం చేస్తామని ఎస్ఈ ఏద్దేవా చేశారని సైదులు మీడియాకు వెల్లడించారు. ఈ విషయంపై ప్రభుత్వం మెగా ఇంజనీర్స్ కంపెనీ మీద చట్ట పరమైన చర్యలు తీసుకునే విధంగా చూడాలని గ్రామస్తులు కోరుతున్నట్లుగా తెలిపారు.