BRSతో కాంగ్రెస్ నేతల కుమ్మక్కు: రాజగోపాల్ రెడ్డి

విధాత: సొంత వ్యాపారాలు, పదవుల కోసం టి.కాంగ్రెస్ నాయకులు అధికార బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం)మండలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా నాయకత్వ లోపం వల్ల రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయిందన్నారు. అంతేకాదు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయాడని, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ,మోడీ వైపు […]

BRSతో కాంగ్రెస్ నేతల కుమ్మక్కు: రాజగోపాల్ రెడ్డి

విధాత: సొంత వ్యాపారాలు, పదవుల కోసం టి.కాంగ్రెస్ నాయకులు అధికార బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కు అయ్యారని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం)మండలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి కూడా నాయకత్వ లోపం వల్ల రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయిందన్నారు.

అంతేకాదు జాతీయ, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడిందన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయాడని, తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు ,మోడీ వైపు చూస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి ఆలోచించి మాట్లాడాలని, బీజేపీ, బీఆర్ఎస్‌లు ఎప్పటికి ఒకటి కావన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం అడ్డుపెట్టుకొని, వంద మంది ఎమ్మెల్యేలతో, అవినీతి డబ్బుతో దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా మునుగోడులో గెలిచారని, మునుగోడు ధర్మ యుద్ధంలో నైతికంగా బీజేపీదే విజ‌యం అన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది బీఆర్ఎస్‌కు వేసినట్టే అని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నియంత మాదిరిగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారన్నారు. గణతంత్ర దినోత్సవం జరపక పోవడం అంటే అంబేడ్కర్‌ను, రాజ్యాంగాన్ని అవమానించినట్లేనన్నారు.

గవర్నర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన దుర్మార్గుడు, చదువురాని దద్దమ్మ పాడి కౌశిక్ రెడ్డి అని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు చూస్తే తెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో అర్థం అవుతుందని, టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకున్న సీఎం కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.