రేవంత్ నాయకత్వంలో పని చేయలేరు.. బీజేపీలోకి రండి: కోమటిరెడ్డి

సీనియర్లకు రాజగోపాల్ రెడ్డి పిలుపు విధాత: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సీనియర్లు గౌరవంగా పనిచేయలేరని వారంతా మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు బీజేపీలోకి రావాలని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాజగోపాల్ రెడ్డి దంపతులు చండూరులో అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బ్రోకరు బ్లాక్‌మెయిలర్ అని తాను ముందే చెప్పానని.. కాంగ్రెస్ సీనియర్లు […]

రేవంత్ నాయకత్వంలో పని చేయలేరు.. బీజేపీలోకి రండి: కోమటిరెడ్డి
  • సీనియర్లకు రాజగోపాల్ రెడ్డి పిలుపు

విధాత: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ సీనియర్లు గౌరవంగా పనిచేయలేరని వారంతా మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు బీజేపీలోకి రావాలని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాజగోపాల్ రెడ్డి దంపతులు చండూరులో అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బ్రోకరు బ్లాక్‌మెయిలర్ అని తాను ముందే చెప్పానని.. కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్, భట్టి ఇప్పుడు తెలుసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ లో టీడీపీ వలసవాదులు తిష్ట వేశారని తాను గతంలోనే చెప్పానన్నారు.

ఫిఫా ఫుట్ బాల్ విజేత అర్జెంటీనా

సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానా దోచుకొని దివాలా తీయీస్తే రేవంత్ ఏకంగా రాష్ట్రాన్నే అమ్ముకునే ఘనుడని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ప్రధాని మోడీ 8 ఏళ్లుగా దేశాన్ని అవినీతి రహితంగా పరిపాలిస్తున్నారని ఆయన సారథ్యంలో పనిచేసేందుకు కాంగ్రెస్ సీనియర్లంతా బీజేపీలోకి రావాలని కోరారు.

కాంగ్రెస్‌లో మంచి సీనియర్ నాయకులు ఉన్నారని వారంతా బీజేపీలోకి వస్తే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు మంచి పరిపాలన అందించగలుగుతామని ఆశాభావం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డితో పనిచేయడం కంటే రాజకీయాలను వదిలివేయడం బెటర్ అన్నారు. రేవంత్‌కు ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు గుండె మీద చేయి వేసుకొని నీతివంతమైన పనుల కోసం బీజేపీలోకి రావాలన్నారు.

ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ కుటుంబ పాలన బొంద పెట్టాలంటే మోడీ నాయకత్వంతో మాత్రమే సాధ్యమన్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోయారని, కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన టిఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ఒకటే అనుకుంటున్నారన్నారు. అందుకే తెలంగాణ ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని రాజా గోపాల్ రెడ్డి అన్నారు.

BIGGBOSS: బిగ్ బాస్ సీజన్-6 విజేత రేవంత్

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముమునుగోడు ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్యపెట్టేలా దత్తత తీసుకుంటానని చెప్పగా నమ్మిన ప్రజలు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అధికార పార్టీ కి ఓటేసి గెలిపించారన్నారు. బీఆర్ఎస్ గెలిచి నెలన్నర కావస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గం లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదన్నారు.

కేవలం రివ్యూ మీటింగ్ చేసి మునుగోడు నియోజకవర్గం తో పాటు జిల్లాకు నిధులు ఇస్తామన్నారని.. ఇప్పటి వరకు నిధులు రాలేదన్నారు. తాను రాజీనామా చేసిందే మునుగోడు అభివృద్ధి కోసమని, అయితే ప్రజలు మిమ్మల్ని గెలిపించినందుకు అభివృద్ధి చేయాలి కదా అంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

చండూరులో ఎర్రబెల్లి దయాకర్ ప్రచారం చేసి.. అభివృద్ధి చేస్తామని చెప్పి పత్తా లేడన్నారు. ప్రభుత్వం వెంటనే వచ్చే ఎన్నికల లోపు మీరు ఇచ్చిన హామీలకు సంబంధించిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గొల్ల కురుమలను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందన్నారు. ఎకౌంట్లో పైసలు వేసి ఎన్నికలు అయిపోయాక మళ్లీ రిటర్న్ తీసుకుందన్నారు. తెలంగాణ మొత్తం అప్పుల పాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో భారతదేశాన్ని దోచుకోవాలని చూస్తున్నాడని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు.

కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్య ఉచిత వైద్యం వచ్చిందా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా అంటూ ప్రశ్నించారు. ఏం ఉద్ధరించడానికి బీఆర్ఎస్ పెట్టి భారత దేశంలో తిరుగుతున్నాడ‌ని విమర్శించారు.

మూడుసార్లు ముఖ్యమంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి గా పనిచేసన మచ్చలేని నాయకుడుగా మోడీకి పేరుందని, దేశంలో అత్యంత అవినీతిమయమైన కేసీఆర్ కుటుంబం ఈరోజు మోడీ గురించి మాట్లాడుతూ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇక్కడ బీఆర్ఎస్‌ను ప్రజలు బొంద పెడుతున్నారనే కొత్త దుకాణం తెరవడానికి ఢిల్లీ పోతున్నారన్నారని విమర్శలు చేశారు.