MLC KAVITHA | మహిళా హక్కులపై కాంగ్రెస్, BJP దొందు దొందే: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC KAVITHA | పదేళ్లలో మహిళా బిల్లుపై సోనియా ప్రియాంక గాంధీలు ఎందుకు మాట్లాడలేదు డిసెంబరులో మరోసారి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తా సోనియా స్మృతి ఇరానీలను కూడా పిలుస్తా విధాత, హైదరాబాద్ : మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేస్తేనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాదులోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు […]

  • By: krs    latest    Aug 23, 2023 3:40 PM IST
MLC KAVITHA | మహిళా హక్కులపై కాంగ్రెస్, BJP దొందు దొందే: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC KAVITHA |

  • పదేళ్లలో మహిళా బిల్లుపై సోనియా ప్రియాంక గాంధీలు ఎందుకు మాట్లాడలేదు
  • డిసెంబరులో మరోసారి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తా
  • సోనియా స్మృతి ఇరానీలను కూడా పిలుస్తా

విధాత, హైదరాబాద్ : మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేస్తేనే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

బుధవారం హైదరాబాదులోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళల హక్కులపై కాంగ్రెస్ బిజెపి దొందు దొందేనని, ఆ రెండు పార్టీల వైఖరి ఒకటేనని మండిపడ్డారు.

2010 రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌ సభలో ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. గత పదేళ్ల కాలంలో మహిళా బిల్లుపై సోనియా, ప్రియాంక లు ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు నిలదీయలేదని అడిగారు.

ఈ ఏడాది డిసెంబర్లో మరోసారి తాను ఢిల్లీలోని జంతర్‌ మంతర్ వద్ద ధర్నా చేస్తానని, ఆ ధర్నాకు సోనియా, ప్రియాంక, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నీ సైతం ఆహ్వానిస్తానని ప్రకటించారు.