Congress | కాంగ్రెస్ రాబంధులకు.. రైతుబంధు ఆలోచనే రాలే: మంత్రి కేటీఆర్
Congress సంక్షేమానికి స్వర్ణయుగం కేసీఆర్ పాలన మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డి బీఆరెస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ విధాత, నిజామాబాద్: కాంగ్రెస్ రాబంధులకు వారు పాలించిన 50ఏళ్లలో ఏనాడు రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచనగాని, 24గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న సోయి ఎందుకు రాలేదంటు మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బహిరంగ సభలో మాట్లాడుతు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు మూడు పంటలకు నీరు, 24గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని, కాంగ్రెస్ […]

Congress
- సంక్షేమానికి స్వర్ణయుగం కేసీఆర్ పాలన
- మున్సిపల్ ఐటి శాఖ మంత్రి కేటీఆర్
- ఎల్లారెడ్డి బీఆరెస్ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్
విధాత, నిజామాబాద్: కాంగ్రెస్ రాబంధులకు వారు పాలించిన 50ఏళ్లలో ఏనాడు రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచనగాని, 24గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న సోయి ఎందుకు రాలేదంటు మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బహిరంగ సభలో మాట్లాడుతు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు మూడు పంటలకు నీరు, 24గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నారని, కాంగ్రెస్ మూడు గంటల కరెంటు చాలంటుందని, రైతన్నలు ఆగం కాకుండా రాబంధులు కావాలో, రైతుబంధువు కావాలో ఆలోచించుకోవాలన్నారు.
తెలంగాణ రాకముందే వ్యవసాయానికి కరెంటు ఎట్లా ఉందో ఇప్పుడెట్లా ఉందో రైతులు ఆలోచించుకోవాలన్నారు. ఎరువులు, విత్తనాలు కూడా సక్కగా పంచే తెలివి కాంగ్రెస్ నేతలకు లేదని, పోలీస్ స్టేషన్లలో వాటిని పంచిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పాలనకే చెల్లిందన్నారు. కాంగ్రెస్ కాలంలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, నెర్రెలు బారిన నేలలు, నెత్తురు కారిన భూములని, తీవ్రమైన కరవు ఉందన్నారు.
నేడు తెలంగాణలో ఎక్కడా చూసిన భూగర్భ జలాలు సమృద్దిగా ఉన్నాయని, 24గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, సాగునీరు అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ పాలన రైతన్నలతో పాటు సబ్బండ వర్గాల సంక్షేమానికి స్వర్ణయుగమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షభమ పథకాలు అందిస్తున్నాన్నారు. గ్రామాల్లో గతంలో మంచినీటి పరిస్థితి, సాగునీటి గోసలు ఎట్లుండేనో ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాలన్నారు.
బీజేపీ రాష్ట్రంలో మతం పేరిట మంటలు పెట్టే పార్టీ అని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమి లేదని, దేశంలో అన్నింటి ధరలు పెంచారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి, రైతుబంధు, దళిత బంధు, బీసీ బంధు రద్ధు చేస్తామంటున్నారని కేసీఆర్ ఆరోపించారు. మళ్లా ఆ దిక్కుమాలిన దళారీ, కుంభకోణాల కాంగ్రెస్ రాజ్యం మనకు అవసరమా అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీ లో ప్రత్యేక గుర్తింపు ఇస్తూ వస్తుందన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు,బ్రిడ్జిల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారనన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉంటే ఎల్లారెడ్డి లో అత్యధికంగా 1లక్షా 3 వేల మందిక ఉన్నారని, ఆ రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుందన్నారు.
గడపగడపకు కాంగ్రెస్ అన్న మాటలు వింటే ఆశ్చర్యంగా ఉందని, ఇక్కడి షబ్బీర్ అలీ మంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని, సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల వాళ్ల మాదిరిగా ఎన్నికలప్పుడు కాంగ్రెసోళ్లు మోపవుతారంటు నోటికొచ్చినవి చెప్పే వారి మాటలను నమ్మవద్ధన్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించాలని, బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలన్నారు. రాష్ట్ర ప్రజలకు రామబాణం సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. కేసీఆర్ తో మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడుతాయని, ఢిల్లీ బానిసలతో కాదని, కాంగ్రెస్, బీజేపీలకు అధికారమిస్తే డిల్లీలో నిర్ణయాలు జరుగుతాయని, మనమే అధికారంలో ఉంటే తెలంగాణలో నిర్ణయాలు జరుగుతాయన్నారు.
అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు
రాష్ట్ర ఐ.టి. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో సుమారు 60 కోట్ల వ్యయం గల పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. ముందుగా నర్సన్ పల్లి బైపాస్ వద్ద 61 లక్షల వ్యయంతో నిర్మించిన కామారెడ్డి ప్రవేశ ద్వారం ఆర్చ్ ను ప్రారంభించారు.
జాతీయ రహదారి 44 నుండి ఈ.ఎస్.ఆర్. గార్డెన్ వరకు కోటి 20 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను, 2 కోట్ల 80 లక్షలతో నిర్మించిన మీడియన్ ను ప్రారంభించారు. అదేవిధంగా జాతీయ రహదారి 44 నుండి మారుతీ సుజుకి షో రూమ్ వరకు 7 కోట్ల వ్యయంతో 4 వరుసల నుండి 6 వరుసలుగా విస్తరించిన బి.టి. రహదారిని, కోటి 60 లక్షలతో మారుతీ సుజుకి షో రూమ్ నుండి ఈ.ఎస్.ఆర్. గార్డెన్ వరకు విస్తరించిన రహాదారిని ప్రారంభించారు. మునిసిపల్ కార్యాలయం నుండి ఈ.ఎస్.ఆర్. గార్డెన్ వరకు కోటి మూడు లక్షల వ్యయంతో నిర్మించిన మీడియన్ ను, 80 లక్షల వ్యయంతో టేక్రియాల్ బైపాస్ నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్మించిన సెంట్రల్ మీడియన్ ను ప్రారంభించారు.
అదేవిధంగా టేక్రియాల్ బైపాస్ నుండి ఈ.ఎస్.ఆర్. గార్డెన్ వరకు 10 కోట్ల 20 లక్షల వ్యయంతో 4 వరుసల నుండి 6 వరుసలు విస్తరించిన బి.టి. రోడ్ ను, టేక్రియాల్ బైపాస్ నుండి కామారెడ్డి కొత్త బస్టాండ్ వరకు కోటి 42 లక్షల వ్యయంతో నిర్మించిన సెంట్రల్ మీడియన్ ను, డిగ్రీ కాలేజీ నుండి ఈ.ఎస్.ఆర్ గార్డెన్ వరకు కోటి 22 లక్షల వ్యయంతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్ ను మంత్రి ప్రారంభించారు.
అనంతరం తాడ్వాయి మండల కేంద్రంలో రెండు కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్పోర్ట్స్ స్టేడియం కు శంఖు స్థాపన చేశారు. ఆ తరువాత యెల్లారెడ్డి మున్సిపాలిటీలో 5 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హై లెవెల్ బ్రిడ్జిలను , 3 కోట్ల 30 లక్షల ఖర్చుతో నిర్మించిన రోడ్డు పునరుద్ధరణ పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
4 కోట్ల 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి, 10 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న సి.సి. రోడ్లు, మురుగుకాలువలు, బి.టి. రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. అలాగే 2 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న వెజ్, నాన్-వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి, 4 కోట్ల ఖర్చుతో నిర్మించనున్న మునిసిపల్ భవన నిర్మాణానికి మంత్రి శంఖు స్థాపన చేశారు. 80 లక్షల ఖర్చుతో ఏర్పాటుచేసిన చిల్డ్రన్స్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు.