నల్గొండ: రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ధర్నాలు

విధాత: రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, ధరణిలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మండల కేంద్రాలలో తహశిల్ధార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని పరిష్కరించి, నిషేధిత జాబితాల నుంచి రైతుల భూములను తొలగించి అర్హులైన వారందరికీ పట్టాలు, అసైన్డ్, పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని ధర్నాల్లో ఆ పార్టీ నాయకులు […]

  • By: krs    latest    Nov 24, 2022 11:10 AM IST
నల్గొండ: రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ధర్నాలు

విధాత: రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, ధరణిలో మార్పులు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మండల కేంద్రాలలో తహశిల్ధార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాటిని పరిష్కరించి, నిషేధిత జాబితాల నుంచి రైతుల భూములను తొలగించి అర్హులైన వారందరికీ పట్టాలు, అసైన్డ్, పోడు భూముల పట్టాలు పంపిణీ చేయాలని ధర్నాల్లో ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

రైతులకు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని, సబ్సిడీలు, పంట నష్ట పరిహార పథకాలు అమలు చేయాలని కోరారు. మునుగోడు, ఆలేరు, భువనగిరి, వలిగొండ, మిర్యాలగూడలో, హుజూర్ నగర్, కోదాడ, వలిగొండ, పోచంపల్లి, సాగర్ తదితర మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించారు.