బీఆరెస్‌ అభివృద్ధి కావాలా? కాంగ్రెస్ అరాచకం కావాలా?

బీఆరెస్ అభివృద్ధి కావాలా కాంగ్రెస్ అరాచకం కావాలా? ఆగం కాకండి..ఆలోచించి ఓటు వేయండని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

బీఆరెస్‌ అభివృద్ధి కావాలా? కాంగ్రెస్ అరాచకం కావాలా?
  • ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌
  • వనమా, దుర్గంల అరాచకాల సంగతేమిటంటూ కాంగ్రెస్ కౌంటర్‌


విధాత : బీఆరెస్ అభివృద్ధి కావాలా కాంగ్రెస్ అరాచకం కావాలా? ఆగం కాకండి..ఆలోచించి ఓటు వేయండని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ట్వీట్‌కు కాంగ్రెస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. మీ బీఆరెస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కుమారుడు వనమా రాఘవేంద్రరావు , పెద్దపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యలు మన తెలంగాణ ఆడబిడ్డల మీద చేసినవి అరాచకాలు కావా కవిత గారు అంటూ ప్రశ్నిస్తూ కాంగ్రెస్ కౌంటర్ ట్వీట్ చేసింది. బీఆరెస్‌ అరాచకాలకు చరమగీతం పాడటానికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారని కాంగ్రెస్ తన ట్వీట్‌లో పేర్కోంది.