Congress | జనగాం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొమ్మూరి.. నిరాశలో పొన్నాల వర్గం
Congress | బహిరంగంగా రెండు గ్రూపులు పొన్నాల టికెట్ పై నీలినీడలు బీసీవాదం వినిపిస్తున్న పొన్నాల విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ప్రతిష్టంభనకు అధిష్టానం ఎట్టకేలకు తెరదించింది.ఇందులో భాగంగా ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని గురువారం నియమించారు. జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా జనగామ డీసీసీ అధ్యక్షుడిగా మాజీ […]

Congress |
- బహిరంగంగా రెండు గ్రూపులు
- పొన్నాల టికెట్ పై నీలినీడలు
- బీసీవాదం వినిపిస్తున్న పొన్నాల
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న ప్రతిష్టంభనకు అధిష్టానం ఎట్టకేలకు తెరదించింది.ఇందులో భాగంగా ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న జనగామ జిల్లా అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిని గురువారం నియమించారు.
జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా జనగామ డీసీసీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని మూడు జిల్లాలకు కాంగ్రెస్ పార్టీ డీసీసీ చీఫ్‌లను నియమించింది.
ఈ మేరకు నిర్మల్ జిల్లాకు కూచాడి శ్రీహర్‌రావు, యాదాద్రి భువనగిరి జిల్లాకు అండెం సంజీవ రెడ్డి, జనగామకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిలను డీసీసీ చీఫ్ లుగా నియమిస్తు ఏఐసీసీ ప్రకటన చేసింది. కాగా జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొమ్మూరిని నియమించడం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలకు గట్టి షాకిచ్చినట్లుగా భావిస్తున్నారు.
నిరాశలో పొన్నాల వర్గం
తాజా నియామకంతో పొన్నాల లక్ష్మయ్య వర్గం తీవ్రనిరాశతో ఉంది. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా తన అనుచరునికి ఇప్పించాలని తీవ్ర ప్రయత్నం చేశారు. దీనివల్ల నియామకం జాప్యమైంది. ఇంత ప్రయత్నం చేసినప్పటికీ మాజీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పొన్నాల తన పట్టు నిలబెట్టుకోలేక పోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధిష్టానం వద్ద తన పలుకుబడి తగ్గిందా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొన్నాల సమ్మతితో ఈ నియామకం జరిగిందా? లేదా అనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బహిరంగంగా రెండు గ్రూపులు
డీసీసీ చీఫ్‌గా కొమ్మూరి నియామకంతో జనగామలో గ్రూపు తగదాలు తగ్గుతాయా? మరింత పెరుగుతాయా? చర్చ జరుగుతోంది. ప్రధానంగా కొమ్మూరి, పొన్నాల అనుచరులు రెండు గ్రూపులుగా విడిపోయి ఉన్నారు. బహిరంగంగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. భట్టి పాదయాత్ర సందర్భంగా ఇరువర్గాలు తన్నుకున్నాయి. ఈ స్థితిలో ఇరువర్గాలు కలిసి పనిచేస్తాయనేది అనుమానమేనంటున్నారు.
పొన్నాల టికెట్ పై నీలినీడలు
డీసీసీ అధ్యక్షుడుగా కొమ్మూరిని నియమించినందున వచ్చే ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య కు టికెట్ వస్తుందా? లేదా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలే బీసీలకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్న సమయంలో ఈ నియామకం ఆసక్తి కరంగా మారింది. ఇదిలాఉండగా ఎన్నికల్లో పార్టీ టికెట్ పొన్నాలకు ఇచ్చేలా, డీసీసీ అధ్యక్ష పదవి కొమ్మూరికి ఇచ్చి రాజీ చేశారా? ఏదైనా కొద్దిరోజుల్లో ఈ వ్యవహారంలో నిజం ఏమిటో తేలనుంది.