Congress | అవినీతికి కేంద్రం.. కాళేశ్వ‌రం: అయోధ్య రెడ్డి

Congress ఆధారాలు ఇచ్చినా చ‌ర్య‌లు తీసుకోని బీజేపీ స‌ర్కారు పిసిసి అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి విధాత‌: అవినీతికి కేంద్రం కాళేశ్వ‌రం అని ఇప్పుడే ప్ర‌జ‌ల‌కు తెలుస్తున్నదని పీసీసీ అధికార ప్ర‌తినిధి అయోధ్య‌రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న బొజ్జా సంధ్యారెడ్డితో క‌లిసి మీడియాతో మాట్లాడుతూ నెల రోజులు వర్షాలు పడనందుకే ముఖ్యమంత్రి నియోజకవర్గమైన‌ గజ్వేల్‌తోపాటు.. సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో విత్తనాలు కూడా వేయని పరిస్థితి నెల‌కొన్న‌ద‌న్నారు. కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకొనే సీఎం ఇప్పుడు […]

  • Publish Date - July 4, 2023 / 12:48 PM IST

Congress

  • ఆధారాలు ఇచ్చినా చ‌ర్య‌లు తీసుకోని బీజేపీ స‌ర్కారు
  • పిసిసి అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి

విధాత‌: అవినీతికి కేంద్రం కాళేశ్వ‌రం అని ఇప్పుడే ప్ర‌జ‌ల‌కు తెలుస్తున్నదని పీసీసీ అధికార ప్ర‌తినిధి అయోధ్య‌రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో ఆయ‌న బొజ్జా సంధ్యారెడ్డితో క‌లిసి మీడియాతో మాట్లాడుతూ నెల రోజులు వర్షాలు పడనందుకే ముఖ్యమంత్రి నియోజకవర్గమైన‌ గజ్వేల్‌తోపాటు.. సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో విత్తనాలు కూడా వేయని పరిస్థితి నెల‌కొన్న‌ద‌న్నారు. కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకొనే సీఎం ఇప్పుడు ఏమి చెబుతారని ప్ర‌శ్నించారు.

తెలంగాణ ఏర్పాటయ్యేనాటికి 19 లక్షల 3 వేల విద్యుత్తు కనెక్షన్లు ఉంటే.. ఇప్పుడు 27 లక్షల 49 వేలు అయ్యాయ‌న్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఉపయోగపడితే రైతులు బోర్లు వేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్ర‌శ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 18 లక్షల పాత ఆయకట్టుకు, మరో 18 లక్షలు కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తామ‌ని చెప్పార‌ని, కాళేశ్వరం ద్వారా కాలువ‌ల‌ నుండి ఏ ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? అని అడిగారు. కాళేశ్వ‌రం ప్రాజెక్ట్‌కు రూ. 82 వేల కోట్లు నిధులు ఖర్చు చేశారని, మ‌రి నీళ్లేవ‌న్నారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోయలేదు కానీ నిధులు ఎత్తిపోశారని ఆయోధ్య‌రెడ్డి ఆరోపించారు.

2009-14 మధ్య టెలిఫోన్‌ బిల్లు కట్టనందుకు తెలంగాణ భవన్‌కు కనెక్షన్ కట్ చేశారని, ఉద్యోగులకు జీతాలు ఇయ్యక పోతే నిరసనలు తెలిపార‌ని, అలాంటి మీకు ఈరోజు మీకు రూ. 1200 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్ర‌శ్నించారు.

కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని చెబుతున్న బీజేపీ నాయకులు ఎం చర్యలు తీసుకున్నారని అడిగారు. మేము ఆధారాలతో సహా వారికీ ఇచ్చినా, ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ముఖ్యమంత్రి లాంటి నీరో చక్రవర్తి వల్లే రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇన్ని ఇబ్బందులు వ‌చ్చాయ‌న్నారు.