Viral Video | డ్యాన్స్ చేస్తూ.. గాల్లోకి కాల్పులు జ‌రిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Viral Video | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అనుప్పూర్ జిల్లా కొట్మా ప‌ట్ట‌ణంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాల్లోకి కాల్పులు జ‌రిపాడు. శ‌నివారం రాత్రి నిర్వ‌హించిన న్యూ ఇయ‌ర్ సెలబ్రేష‌న్స్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ స‌ర‌ఫ్ పాల్గొన్నాడు. అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన డాన్ మూవీలోని మెయిన్ హున్ డాన్ అనే పాట‌ను గాయ‌కులు ఆల‌పిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే సునీల్‌ను కొంత‌మంది అభిమానులు.. వేదిక‌పైకి తీసుకెళ్లారు. ఇక ఎమ్మెల్యే కూడా ఆ పాట‌కు స్టెప్పులేశాడు. నెమ్మదిగా త‌న వ‌ద్ద తుపాకీని […]

Viral Video | డ్యాన్స్ చేస్తూ.. గాల్లోకి కాల్పులు జ‌రిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Viral Video | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని అనుప్పూర్ జిల్లా కొట్మా ప‌ట్ట‌ణంలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాల్లోకి కాల్పులు జ‌రిపాడు. శ‌నివారం రాత్రి నిర్వ‌హించిన న్యూ ఇయ‌ర్ సెలబ్రేష‌న్స్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సునీల్ స‌ర‌ఫ్ పాల్గొన్నాడు.

అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించిన డాన్ మూవీలోని మెయిన్ హున్ డాన్ అనే పాట‌ను గాయ‌కులు ఆల‌పిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే సునీల్‌ను కొంత‌మంది అభిమానులు.. వేదిక‌పైకి తీసుకెళ్లారు. ఇక ఎమ్మెల్యే కూడా ఆ పాట‌కు స్టెప్పులేశాడు. నెమ్మదిగా త‌న వ‌ద్ద తుపాకీని బ‌య‌ట‌కు తీసి, గాల్లోకి కాల్పులు జ‌రిపాడు.

అయితే ఈ ఘ‌ట‌న‌పై మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా తీవ్రంగా స్పందించారు. గాల్లోకి కాల్పులు జ‌రిపిన ఎమ్మెల్యే సునీల్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అనుప్పూర్ జిల్లా పోలీసుల‌ను హోంమంత్రి ఆదేశించారు. ప‌బ్లిక్‌లో గాల్లోకి కాల్పులు జ‌ర‌ప‌డాన్ని చాలా మంది త‌ప్పుబ‌ట్టారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను ఉప‌యోగించింది ఫైర్‌క్రాక‌ర్ గ‌న్ అని స్ప‌ష్టం చేశారు. అది దీపావ‌ళి గ‌న్ అని చెబుతూ.. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ సంద‌ర్భంగా జ‌నాలు ప‌టాకులు కూడా కాల్చిన‌ట్లు సునీల్ పేర్కొన్నాడు.