కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక.. షెడ్యూల్‌ విడుదల

విధాత:కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. గురువారం ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ మధుసూదన్‌ మిస్త్రీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. వచ్చే నెల 1న నామినేషన్‌ పత్రాల పరిశీలన, 8న ఉపసంహరణ ఉంటుంది. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే అక్టోబర్‌ 17న ఓటింగ్‌ నిర్వహించనున్నారు. అదే జరిగితే మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించినట్లు అవుతుంది. అక్టోబర్‌ 19న అధ్యక్ష ఎన్నిక […]

  • By: krs    latest    Sep 22, 2022 7:04 AM IST
కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నిక.. షెడ్యూల్‌ విడుదల

విధాత:కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. గురువారం ఎన్నికల ఇన్‌ఛార్జ్‌ మధుసూదన్‌ మిస్త్రీ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఈనెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. వచ్చే నెల 1న నామినేషన్‌ పత్రాల పరిశీలన, 8న ఉపసంహరణ ఉంటుంది. పోటీలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే అక్టోబర్‌ 17న ఓటింగ్‌ నిర్వహించనున్నారు.

అదే జరిగితే మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించినట్లు అవుతుంది. అక్టోబర్‌ 19న అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని విడుదల చేయనున్నారు.