కాంగ్రెస్‌ 8వ జాబితా.. తెలంగాణ అభ్యర్థులు వీరే

కాంగ్రెస్‌ పార్టీ 14 మంది అభ్యర్థులతో లోక్‌సభ ఎన్నికల 8వ జాబితా విడుదల బుధవారం రాత్రి విడుదల చేసింది.

కాంగ్రెస్‌ 8వ జాబితా.. తెలంగాణ అభ్యర్థులు వీరే

కాంగ్రెస్‌ పార్టీ 14 మంది అభ్యర్థులతో లోక్‌సభ ఎన్నికల 8వ జాబితా విడుదల బుధవారం రాత్రి విడుదల చేసింది. అందులో తెలంగాణలో ఇప్పటివరకు 9 స్థానాలను ప్రకటించిన ఆ పార్టీ తాజాగా మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆదిలాబాద్‌ నుంచి డాక్టర్‌ సుగుణ కుమారి, నిజామాబాద్‌ నుంచి ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి, మెదక్‌ అభ్యర్థిగా నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిలను ఖరారు చేసింది. మిగిలిన 10 స్థానాల్లో జార్ఖండ్‌ నుంచి 3, మధ్యప్రదేశ్‌ నుంచి 3, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 4 అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.