ఐదుగురి పేర్లతో కాంగ్రెస్‌ రెండో జాబితా

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం గురువారం రాత్రి ప్రకటించింది

ఐదుగురి పేర్లతో కాంగ్రెస్‌ రెండో జాబితా

హైదరాబాద్‌: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధిష్ఠానం గురువారం రాత్రి ప్రకటించింది. మొత్తం ఐదు స్థానాలకు రెండో జాబితాలో ప్రకటన వెలువడింది. ఇందులో పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకు టికెట్‌ కేటాయించారు. సికింద్రాబాద్‌ టికెట్‌ను దానం నాగేందర్‌కు ఇచ్చారు. మల్కాజిగిరి నుంచి ఈసారి సునీత మహేందర్‌రెడ్డి పోటీ చేయబోతున్నారు.


చేవెళ్ల టికెట్‌ రంజిత్‌రెడ్డికి లభించింది. నాగర్‌కర్నూల్‌ను మల్లు రవికి కేటాయించారు. ఖమ్మం, నల్లగొండ స్థానాలపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతున్నది. తొలి జాబితాలో నలుగురి పేర్లను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. అందులో సురేశ్‌ కుమార్‌ షేట్కర్‌ (జహీరాబాద్‌), కుందూరు రఘువీర్‌రెడ్డి (నల్లగొండ), చల్లా వంశీచందర్‌రెడ్డి (మహబూబ్‌నగర్‌), బలరాం నాయక్‌ (మహబూబాబాద్‌) ఉన్నారు.