అటవీ అధికారి హత్యలో కుట్ర కోణం!
ఆందోళనలు ఆదివాసులు.. అభద్రతా భావంలో అధికారులు విధాత: ఖమ్మం చంద్రుగొండ రేంజ్ అటవీ అధికారి శ్రీనివాసరావు హత్యలో కుట్ర కోణం ఉన్నదా అంటే ఔననే అంటున్నారు ఆదివాసులు. సాధారణ తోపులాట జరిగితే అధికారి ఎలా చనిపోతారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కావాలనే చేసి.. మమ్మల్ని ఇబ్బందుకుల గురి చేయాలని చూస్తున్నారని అనుమానిస్తున్నారు. నిజానికి అక్కడ పశువులు మేపుతున్నఆదివాసులకు అటవీ అధికారులకు మధ్య పెద్ద కొట్లాట ఏమీ జరుగలేదు. ఓ పథకం ప్రకారం దాడి ఎంత మాత్రం […]

- ఆందోళనలు ఆదివాసులు..
- అభద్రతా భావంలో అధికారులు
విధాత: ఖమ్మం చంద్రుగొండ రేంజ్ అటవీ అధికారి శ్రీనివాసరావు హత్యలో కుట్ర కోణం ఉన్నదా అంటే ఔననే అంటున్నారు ఆదివాసులు. సాధారణ తోపులాట జరిగితే అధికారి ఎలా చనిపోతారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కావాలనే చేసి.. మమ్మల్ని ఇబ్బందుకుల గురి చేయాలని చూస్తున్నారని అనుమానిస్తున్నారు.
నిజానికి అక్కడ పశువులు మేపుతున్నఆదివాసులకు అటవీ అధికారులకు మధ్య పెద్ద కొట్లాట ఏమీ జరుగలేదు. ఓ పథకం ప్రకారం దాడి ఎంత మాత్రం కాదు. అధికారులు వచ్చారన్న సమాచారంతో అప్పటికప్పుడు గుమికూడిన వారే అటవీ సిబ్దందితో వాదనకు దిగారు. ఆ క్రమంలో జరిగిన తోపులాటలో అధికారికి చనిపోయేంతటి తీవ్ర గాయాలు అయ్యే అవకాశమే లేదని ఆదివాసులు అంటున్నారు.
అధికారి చనిపోవటంలో ఏదో కుట్ర దాగి ఉన్నదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సాకుగా గిరిజనులను బాధ్యులను చేసి వేధింపులకు గురిచేయటం తగదని వాపోతున్నారు. ఇప్పటికే తాము ఎక్కడ సాగు చేసినా, ఆకులు అలములతో చిన్న గుడిసే వేసినా అడవిని ధ్వంసం చేస్తున్నారని చెప్పి కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు అధికారి హత్యతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అని ఆందోళన చెందుతున్నారు. మరో వైపు అటవీ పర్యవేక్షణ కోసం వెళ్లిన అధికారి హత్యకు గురికావటంతో అటు అధికారుల్లో తీవ్ర అభద్రతా భావం నెలకొన్నది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి తగు చర్యలు తీసుకొని ఇరు వర్గాల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.