సంక్షేమ పాలనకు మార్గదర్శి రాజ్యాంగం: గుత్తా

విధాత: ప్రజలకు సంక్షేమ పాలన, సమ న్యాయం అందించేందుకు ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం మార్గదర్శకంగా నిలుస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నాగార్జున కళాశాలలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవం సదస్సును ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం తరచూ రాజకీయ కోణంలో రాష్ట్రాలపై పెత్తనం కోసం రాజ్యాంగ వ్యవస్థలను, సంస్థలను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందన్నారు. భారతరత్న, […]

  • By: krs    latest    Nov 26, 2022 10:05 AM IST
సంక్షేమ పాలనకు మార్గదర్శి రాజ్యాంగం: గుత్తా

విధాత: ప్రజలకు సంక్షేమ పాలన, సమ న్యాయం అందించేందుకు ప్రభుత్వాలకు భారత రాజ్యాంగం మార్గదర్శకంగా నిలుస్తుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నాగార్జున కళాశాలలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవం సదస్సును ప్రారంభించి మాట్లాడారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం తరచూ రాజకీయ కోణంలో రాష్ట్రాలపై పెత్తనం కోసం రాజ్యాంగ వ్యవస్థలను, సంస్థలను దుర్వినియోగం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందన్నారు.

భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు దేశ ప్రజాస్వామ్య వ్య‌వస్థ పటిష్టతకు దోహదం చేస్తున్నాయన్నారు. రాజ్యాంగం మేరకు పాలనా విధానాలు అమలు చేస్తే ప్రజా సంక్షేమ, సమానత్వం సాధ్యమవుతుందన్నారు.

తెలంగాణ వంటి రాష్ట్రాలు అంబేద్కర్ రాజ్యాంగం సూచించిన చిన్నరాష్ట్రాల ప్రతిపాదనను అనుసరించి ఏర్పడినవేననన్నారు. దేశ సమాఖ్య వ్యవస్థ సక్రమంగా కొనసాగేందుకు అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగ ప్రమాణాలు అందరికీ అనుసరణీయ‌మన్నారు. రాజ్యాంగానికి లోబడి శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు సక్రమంగా పనిచేసినంత కాలం ప్రజాస్వామ్య వ్యవస్థ సమర్థ‌వంతంగా పురోగమిస్తుందన్నారు.

ప్రతి పౌరుడు, పాలకులు రాజ్యాంగ విధుల పట్ల అవగాహన కలిగి ఉండి మంచి పౌర సమాజ నిర్మాణంలో, సుపరిపాలన సాధనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గణ శ్యామ్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.