Maharashtra | కారును ఢీకొట్టిన లారీ.. పది మంది దుర్మరణం
Maharashtra మరో 20 మందికి తీవ్ర గాయాలు మహారాష్ట్ర హైవేపై ఘోర ప్రమాదం బస్ కోసం వేచి ఉన్న వారినీ వదలని మృత్యువు ముంబై: వేగంగా వస్తున్న లారీ ఒక కారును ఢీకొన్న ఘటనలో 10 మంది చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో ముంబై-ఆగ్రా హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదానికి కారణమైన లారీ.. మధ్యప్రదేశ్ నుంచి ధూలె వైపు వస్తున్నది. మంగళవారం ఉదయం 10.45 గంటలకు పలాస్నెర్ గ్రామం […]

Maharashtra
- మరో 20 మందికి తీవ్ర గాయాలు
- మహారాష్ట్ర హైవేపై ఘోర ప్రమాదం
- బస్ కోసం వేచి ఉన్న వారినీ వదలని మృత్యువు
ముంబై: వేగంగా వస్తున్న లారీ ఒక కారును ఢీకొన్న ఘటనలో 10 మంది చనిపోయారు. 20 మందికిపైగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో ముంబై-ఆగ్రా హైవేపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ప్రమాదానికి కారణమైన లారీ.. మధ్యప్రదేశ్ నుంచి ధూలె వైపు వస్తున్నది. మంగళవారం ఉదయం 10.45 గంటలకు పలాస్నెర్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
లారీ మితిమీరిన వేగంతో దూసుకురావడం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఈ సమయంలో అక్కడ సమీపంలో ఉన్నవారు సైతం ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం సమయంలో అక్కడ అంతా దట్టమైన ధూళి లేచింది. చనిపోయినవారిలో అక్కడ బస్‌స్టాప్‌లో బస్ కోసం వేచిచూస్తున్నవారు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. గాయపడినవారిని శిర్పూర్, ధూలె దవాఖానలకు తరలించారు