King Charles 3 | నేడు బ్రిట‌న్ రాజు ఛార్లెస్ -3 ప‌ట్టాభిషేకం

విధాత‌: బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌-3 (King Charles 3) పట్టాభిషేకం నేడు జరగబోతున్నది. బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా ఇప్పటికే నియమితులైన ఛార్లెస్‌కు వందల ఏండ్ల నాటి సంప్రదాయలను అనుసరించి కిరీట ధారణ చేయనున్నారు. 1953 తర్వాత ఇదే తొలి పట్టాభిషేకం. నిరాడంబరంగా జరగబోతున్న ఈ వేడుకలో ఛార్లెస్‌తో పాటు ఆయన భార్య రాణి కెమిల్లా క్వీన్‌మేరీ కిరీటం ధరించనున్నారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబెలో నేడు జరగనున్న ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ […]

King Charles 3 | నేడు బ్రిట‌న్ రాజు ఛార్లెస్ -3 ప‌ట్టాభిషేకం

విధాత‌: బ్రిటన్‌ రాజుగా ఛార్లెస్‌-3 (King Charles 3) పట్టాభిషేకం నేడు జరగబోతున్నది. బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే అధికారికంగా ఇప్పటికే నియమితులైన ఛార్లెస్‌కు వందల ఏండ్ల నాటి సంప్రదాయలను అనుసరించి కిరీట ధారణ చేయనున్నారు. 1953 తర్వాత ఇదే తొలి పట్టాభిషేకం. నిరాడంబరంగా జరగబోతున్న ఈ వేడుకలో ఛార్లెస్‌తో పాటు ఆయన భార్య రాణి కెమిల్లా క్వీన్‌మేరీ కిరీటం ధరించనున్నారు.

లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబెలో నేడు జరగనున్న ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు, దౌత్యవేత్తలు ఇప్పటికే లండన్‌ చేరుకున్నారు. భారత్‌ తరఫున ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. దాదాపు 2000 మంది విదేశీ ప్రముఖులు, రాజకుటుంబీకుల సమక్షంలో ఈ పట్టాభిషేకం జరుగుతుంది. 1661లో తయారైన 2.23 కిలోల బంగారు కిరీటాన్ని ఛార్లెస్‌-3 ధరించనున్నారు.

ఈ రాజభరణాల విలువ 300 కోట్ల నుంచి 500 కోట్ల పౌండ్లు ఉంటుందని అంచనా. పట్టాభిషేకానికి రూ. వెయ్యి కొట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. పట్టాభిషేకం అనంతరం బంగారు తాపడం బగ్గీలో రాజు, రాణి ప్రయాణిస్తారు. బ్రిటన్‌లో ఈ కార్యక్రమాన్ని 3.7 కోట్ల మంది వీక్షిస్తారని అంచనా వేస్తున్నారు. చట్టాన్ని కాపాడుతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్‌ ప్రమాణం చేస్తారు. 1300 సంవత్సరంలో కింగ్‌ ఎడ్వర్డ్‌ సింహాసనంపై ఛార్లెస్‌-3 కూర్చోనున్నారు.