ఉజ్జయినీ: ఉత్తర మహాకాళేశ్వర ఆలయ కారిడార్ నేడు జాతికి అంకితం
విధాత: మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం ఉజ్జయినీలోని ఉత్తర మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా పూర్తి చేసిన మొదటి దశను ప్రధాని మోడీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. సుమారు రూ. 856 కోట్లతో ఈ పనులను పూర్తిచేశారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కారిడార్ ప్రారంభోత్సవానికి గుర్తుగా ప్రధాని శివలింగాన్నిఆవిష్కరిస్తారు. ఈ సాయంత్రం 5 గంటలకు ఉజ్జెయినీ వెళ్లనున్న మోడీ మహాకాళేశ్వర్ ఆలయంలో పూజలు చేస్తారు. […]

విధాత: మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం ఉజ్జయినీలోని ఉత్తర మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా పూర్తి చేసిన మొదటి దశను ప్రధాని మోడీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. సుమారు రూ. 856 కోట్లతో ఈ పనులను పూర్తిచేశారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కారిడార్ ప్రారంభోత్సవానికి గుర్తుగా ప్రధాని శివలింగాన్నిఆవిష్కరిస్తారు. ఈ సాయంత్రం 5 గంటలకు ఉజ్జెయినీ వెళ్లనున్న మోడీ మహాకాళేశ్వర్ ఆలయంలో పూజలు చేస్తారు.
ఈ ఆలయ విశేషాలివే..
అడుగడుగునా ఆధ్యాత్మిక సౌరభం. అద్బుతమైన శిల్పకళా నైపుణ్యం, వేదాల సారాన్ని ప్రబోధించే చిత్రాలు, మహాకవి కాళిదాసు వర్ణించిన మొక్కలు, వివధ రూపాల్లో నీలకంఠుడి ప్రతిమలు, శివపురాణాన్ని వర్ణించే కుడ్యాలు, సుందరమైన సరస్సులు ఇలా అనేక విశేషాలతో ఆ ఆలయం చూపరులను ఆకట్టుకుంటున్నది.
భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లాలా ఉన్నది. భారత ఆలయ వైభవాన్ని మళ్లీ విశ్వవ్యాప్తం చేసేలా మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం ఉజ్జెయినీలోని మహాకాల్ లోక్‌ను అభివృద్ధి చేశారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లోని ఒకటిగా ప్రసిద్ధి చెందిన మహాకాళేశ్వర్ ఆలయం ఇప్పుడు మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని దేదీప్యమానంగా వెలిగిపోతున్నది.