Covid 19 | మానుకోటలో.. కరోనా కలకలం.. గురుకుల పాఠశాలలో 15మందికి పాజిటివ్
ట్రైబల్ వెల్పేర్ గురుకుల పాఠశాలలో 15మందికి పాజిటివ్ ఐసోలేషన్ కు తరలింపు ఆందోళనలో విద్యార్ధుల తల్లిదండ్రులు కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి సత్యవతి విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోటలో కరోనా (Covid 19) కలకలం సృష్టించింది. స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులలో 15 మందికి పాజిటివ్ రావడంతో ఆందోళనలకు నెలకొంది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ కు తరలించారు. తమ పిల్లలకి కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు […]

- ట్రైబల్ వెల్పేర్ గురుకుల పాఠశాలలో 15మందికి పాజిటివ్
- ఐసోలేషన్ కు తరలింపు
- ఆందోళనలో విద్యార్ధుల తల్లిదండ్రులు
- కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి సత్యవతి
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మానుకోటలో కరోనా (Covid 19) కలకలం సృష్టించింది. స్థానిక ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులలో 15 మందికి పాజిటివ్ రావడంతో ఆందోళనలకు నెలకొంది. కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను ఐసోలేషన్ కు తరలించారు.
తమ పిల్లలకి కరోనా పాజిటివ్ వచ్చిందని సమాచారంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ సమాచారం తెలిసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు .
జిల్లాకలెక్టర్ శశాంకతో పాటు సంబంధిత అధికారులతో పోన్ లో మాట్లాడిన అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి ఆదేశించారు. అవసరమైన తక్షణ చర్యలు తీసుకుంటామని , అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటామని, ఆందోళన వద్దంటు తల్లిదండ్రులకు మంత్రి సత్యవతిరాథోడ్ దైర్యం చెప్పారు.