Suspend | జుట్టు పట్టిన కానిస్టేబుల్ సస్పెండ్‌

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చి గాయపరచడంతో పాటు కొట్టిన కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేశారు

Suspend | జుట్టు పట్టిన కానిస్టేబుల్ సస్పెండ్‌

Suspend | విధాత: ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చి గాయపరచడంతో పాటు కొట్టిన కానిస్టేబుల్ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ అవినాశ్ మహంతి కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేశారు. వ్యవసాయ, ఉద్యాన వన యూనివర్సిటీలకు చెందిన 100 ఎకరాల భూములను హైకోర్టు నిర్మాణానికి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న ఝాన్సీపై కానిస్టేబుల్ ఫాతిమా వ్యవహారించిన తీరు వివాదస్పదమైంది.


దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం, మహిళా కమిషన్లు తెలంగాణ సీఎస్‌, డీజీపీలకి నోటీస్‌లు కూడా జారీ చేశాయి. పోలీసు శాఖ పనితీరుపై విమర్శలకు దారితీసిన ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న సీపీ అవినాష్‌ మహంతి విచారణ జరిపి కానిస్టేబుల్ ఫాతిమాను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. కాగా కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తనతో గాయపడిన ఝాన్సీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు.