కాళేశ్వరంపై బీజేపీ సీబీఐ విచారణ డిమాండ్ ఓ పెద్ద జోక్
కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ సీబీఐ విచారణ అడగడం ఒక పెద్ద జోక్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

- సీపీఐ నేత నారాయణ విమర్శలు
విధాత, హైదరాబాద్ :కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ సీబీఐ విచారణ అడగడం ఒక పెద్ద జోక్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరంపై ఎందుకు సీబీఐ దర్యాప్తు వేయలేకపోయారని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర స్కామ్‌లో కవితను రెండేళ్ల నుంచి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ప్రశ్నించారు. బీఆరెస్, బీజేపీకి మధ్య సయోధ్య ఉందని, అందుకే ఎమ్మెల్సీ కవిత బయట ఉందన్నారు.
కేసీఆర్ అవినీతిని సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్ సేఫ్ అవుతారన్నారు. కుట్రపూరితంగా కేసీఆర్‌ను కాపాడటానికి బీజేపీ కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరుతోందని విమర్శించారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్ సేఫ్‌గా ఉంటారని బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారన్నారు. కేసీఆర్ జుట్టును వారి చేతిలో పెట్టుకోవాలని బీజేపీ చూస్తోందన్నారు. కేసీఆర్‌ను కాపాడే కుటిల బుద్ధి బీజేపీ నేతల్లో కనిపిస్తోందని నారాయణ వ్యాఖ్యలు చేశారు.