సీపీఎస్ రద్దు చేయాల్సిందే.. ఢిల్లీలో కదంతొక్కిన ఉద్యోగులు

సీపీఎస్ రద్దు చేయాల్సిందే.. ఢిల్లీలో కదంతొక్కిన ఉద్యోగులు

– ఏఐఎస్జీఈఎఫ్ ఆధ్వర్యంలో భారీ చైతన్యర్యాలీ

– టీఎన్జీవో రాష్ట్ర సంఘం మద్దతు

విధాత, హైదరాబాద్: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కదంతొక్కారు. రాంలీలా మైదానంలో అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్) ఆధ్వర్యంలో భారీ చైతన్యర్యాలీ నిర్వహించారు. టీఎన్జీవో రాష్ట్ర సంఘం మద్దతు ప్రకటిస్తూ వందలాదిగా ప్రతినిధులు ర్యాలీలో భాగస్వామ్యమయ్యారు. ఈ సందర్భంగా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కే లక్ష్మణ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు జమ అయిన సొమ్మును రాష్ట్రాలకు ఇప్పించి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆదాయపు పన్ను పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, ఉద్యోగుల పెండింగ్ డిమాండ్ లన్నీ పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. లేనట్లయితే రాబోయే ఎన్నికల్లో ఉద్యోగుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

చలో ఢిల్లీ చైతన్య ర్యాలీలో తెలంగాణ నుంచి టీఎన్టీఓ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ గౌడ్, కోశాధికారి ఆర్. శ్రీనివాస రావు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, కామారెడ్డి అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, సాయిలు, మెదక్ అధ్యక్షులు నరేందర్, హనుమకొండ అధ్యక్ష, కార్యదర్శులు ఆకుల రాజేందర్, సోమన్న, జనగామ ఖాజా షరీఫ్, శ్రీనివాస్, మహబూబాబాద్ శ్రీనివాస్, కేంద్ర సంఘం నేతలు కొండల రెడ్డి, నరసింహ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, పర్వతాలు, చారి పాల్గొన్నారు.