పంట నష్టం వివరాలు సక్రమంగా నమోదు చేయాలి: MP కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి డిమాండ్

విధాత: వడగళ్ల వానతో నష్టపోయిన రైతుల పంట నష్టం వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నమోదు చేయాలని బాధిత రైతులకు పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవారం వారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. నెల్లిబండ తండా లో వరి, టమాటా […]

  • By: krs    latest    Mar 21, 2023 9:14 AM IST
పంట నష్టం వివరాలు సక్రమంగా నమోదు చేయాలి: MP కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి డిమాండ్

విధాత: వడగళ్ల వానతో నష్టపోయిన రైతుల పంట నష్టం వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నమోదు చేయాలని బాధిత రైతులకు పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి ఆర్. దామోదర్ రెడ్డిలు డిమాండ్ చేశారు.

మంగళవారం వారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలంలో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. నెల్లిబండ తండా లో వరి, టమాటా పంట నష్టాన్ని పరిశీలించి వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లుతో ఫోన్లో మాట్లాడారు.

నెల్లిబండ తండాలో పలువురు రైతుల పంట నష్టం వివరాలను నమోదు చేయకపోవడంపై వెంకటరెడ్డి ప్రశ్నించారు. వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన రైతుల పంట వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి పంపించాలని కోరారు.

రైతులు అధైర్య పడవద్దని పంట నష్టం ఇప్పించే వరకు ప్రభుత్వంతో కొట్లాడుదామని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తిరుమలగిరి మండలంలో 14,500 ఎకరాలకు గాను పదివేల ఎకరాలు పంట పరిశీలించి 90శాతం నష్టం జరిగినట్లు వివరాలు నమోదు చేశామని తెలిపారు.

కాగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలు తమ మధ్య విభేదాలను పక్కనపెట్టి రైతు సమస్యలపై ఏకమై వడగళ్ల వాన బాధిత రైతుల పంట నష్టం పరిశీలనకు రావడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు రైతులు హర్షం వ్యక్తం చేశారు.