Cyber Crime | మాజీ ఎంపీ హరిరామజోగయ్య పేరుతో డబ్బులు వసూళ్లు
Cyber Crime మాజీ హోంమంత్రి, విశ్రాంత ఐఎఫ్ ఎస్‌లను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు విధాత: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి డబ్బులను దోచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్‌లు, లింకులు, ఈ-మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఈ బాధితుల్లో ప్రముఖులు కూడా చేరిపోయారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ పేరుతో కేటుగాళ్లు ఏకంగా మాజీ హోంమంత్రి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారులకే డబ్బులు అడిగి సక్సెస్ అయ్యారు. పశ్చిమగోదావరి […]

Cyber Crime
- మాజీ హోంమంత్రి, విశ్రాంత ఐఎఫ్ ఎస్‌లను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు
విధాత: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని వాడుకుని నేరగాళ్లు, ప్రజలకు తెలియకుండానే వారి డబ్బులను దోచుకుంటున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర యాప్‌లు, లింకులు, ఈ-మెయిల్స్‌తో హ్యాకర్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ఈ బాధితుల్లో ప్రముఖులు కూడా చేరిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపీ పేరుతో కేటుగాళ్లు ఏకంగా మాజీ హోంమంత్రి, మాజీ ఐఎఫ్ఎస్ అధికారులకే డబ్బులు అడిగి సక్సెస్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ హరిరామజోగయ్య పేరుతో సైబర్ నేరగాళ్లు ఆయన పేరిట పలువురికి ఫోన్ కాల్స్ చేశారు.
తనకు కొంత డబ్బు పంపాలంటూ ఫోన్లో రిక్వెస్ట్ చేశారు. దీంతో సాక్షాత్తూ మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి రూ.9 వేలు ట్రాన్స్ ఫర్ చేశారు. మరో విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి రావు కూడా ఇలాగే డబ్బులు పంపి మోసపోయారు.
విషయం తెలుసుకున్న హరిరామ జోగయ్య తన పేరుతో వచ్చే ఫోన్లకు ఎవరూ డబ్బులు ఇవ్వవద్దని బహిరంగ లేఖ రాశారు. ఫోన్ ద్వారా పాలకొల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ జాగ్రత్తలు పాటించండి
- మొబైల్‌కు వచ్చిన ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు
- అనవసర సమయాల్లో ఇంటర్నెట్ ఆఫ్ చేయడం మంచిది.
- గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింకులను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు.
- అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించుకోవాలి.
- బహుమతులు, లాటరీలు గెల్చుకున్నారంటూ వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మవద్దు.
- వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కల్పిస్తామని చెప్పే వారితో జాగ్రత్తగా ఉండాలి.
- బయటి ప్రాంతాల్లో ఉచిత వై-ఫై ఉపయోగించకపోవడం మంచిది.
- సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు అప్లోడ్ చేయవద్దు.
టోల్ ఫ్రీ నంబర్ -1930
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలియజేస్తే 24 గంటల్లో డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.