తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదు: ప్రధాని మోదీ
విధాత: ప్రధాని బేగంపేటలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ప్రజలు ఒక భరోసా ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రజలు చాటిచెప్పారు. ఒక్క అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కార్ మొత్తం మునుగోడుకు వెళ్లింది. మునుగోడులో కమల వికాసం కనిపించిందన్నారు. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదు. హైదరాబాద్ ఐటీ రంగం హబ్‌గా అవతరించింది. ఐటీలో ముందున్నఅంధ విశ్వాసశక్తులు […]

విధాత: ప్రధాని బేగంపేటలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీకి ప్రజలు ఒక భరోసా ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ప్రజలు చాటిచెప్పారు.
ఒక్క అసెంబ్లీ సీటు కోసం తెలంగాణ సర్కార్ మొత్తం మునుగోడుకు వెళ్లింది. మునుగోడులో కమల వికాసం కనిపించిందన్నారు. తెలంగాణలో అంధకారం ఎక్కువ రోజులు ఉండదు. హైదరాబాద్ ఐటీ రంగం హబ్‌గా అవతరించింది. ఐటీలో ముందున్నఅంధ విశ్వాసశక్తులు పాలిస్తున్నాయని (టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి) అన్నారు.
PM Shri @narendramodi addresses public meeting at Begumpet Airport, Telangana. https://t.co/UEUAqjVqBr
— BJP (@BJP4India) November 12, 2022
ఎర్రజెండా నేతలు అభివృద్ధి, సామాజిక న్యాయానికి వ్యతిరేకులని ప్రధాని మండిపడ్డారు. అభివృద్ధి వ్యతిరేకులతో టీఆర్‌ఎస్ జత కట్టిందని, ప్రజలను లూటీ చేసే ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. పేదలకు అందాల్సిన నిధుల్లో అవినీతికి తావులేకుండా చేశామని ప్రధాని తెలిపారు.
పీఎం కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. ఆధార్, మొబైల్, యూపీఐ వంటి సేవలతో అవినీతి లేకుండా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. నేరుగా ప్రజలకే ఇస్తుండటంతో అవినీతిపరుల కడుపు మండుతున్నదని అన్నారు.
తెలంగాణ ప్రజలను తిడితే సహించను
నన్ను, భారతీయ జనతా పార్టీని సహిస్తాను.. కానీ తెలంగాణ ప్రజలను తిడితే సహించనని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తెలంగాణను దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టనని తేల్చిచెప్పారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి వ్యతిరేక శక్తులతో జతకట్టారని ఆరోపించారు. అవినీతి, కుటుంబ పాలనపై జనంలో ఉన్న ఆగ్రహాన్ని దేశం మొత్తం చూస్తుంది. రాజకీయాల్లో ఎజెండా అనేది ప్రజల సేవ లక్ష్యంగా ఉండాలని బీజేపీ శ్రేణులకే చెబుతన్నాను. నా తొలి ప్రాధాన్యత ప్రజలకే, కుటుంబానికి కాదన్నారు. మోదీపై విమర్శలు చేసే వారిని బీజేపీ కార్యకర్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
తెలంగాణలో అవినీతి రహిత పాలనను అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. మూఢ నమ్మకాల విషయంలో తెలంగాణలో ఏమి జరుగుతుందో దేశానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో కమలం వికసిస్తుంది.
మునుగోడులో బీజేపీ ప్రజలు భరోసానిచ్చారు. బీజేపీ కార్యకర్తలు బలమైన శక్తులు, ఎవరికీ భయపడరు. ప్రజలను లూటీ చేసే ఎవరీని వదిలపెట్టిదిలేదని మోదీ తేల్చిచెప్పారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే అని మునుగోడు ప్రజలు చెప్పారని మోదీ గుర్తు చేశారు.