Delhi | 35 ఏళ్ల భార్య‌ను చంప‌డానికి.. సుపారీ ఇచ్చిన 71 ఏళ్ల భ‌ర్త‌

Delhi | విధాత‌: త‌న 35 ఏళ్ల భార్య‌ను చంప‌డానికి ఇద్ద‌రు కాంట్రాక్ట్ కిల్ల‌ర్స్‌కు సుపారీ ఇచ్చాడు 71 ఏళ్ల భ‌ర్త‌. వారు ఆమెను బుధ‌వారం క‌త్తిపోట్ల‌కు గురి చేసి చంపేశారు. పోలీసుల ద‌ర్యాప్తులో తేలిన వివ‌రాల ప్ర‌కారం.. 71 ఏళ్ల ఎస్ కే గుప్తా.. మానసిక అనారోగ్యంతో బాధ‌ ప‌డుతున్న త‌న కుమారుడి (45) ఆల‌నా పాల‌నా చూసుకుంటుద‌ని 35 ఏళ్ల మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. గ‌తేడాదే వీరి వివాహం జ‌రిగింది. అయితే వివాహం అయిన […]

Delhi | 35 ఏళ్ల భార్య‌ను చంప‌డానికి.. సుపారీ ఇచ్చిన 71 ఏళ్ల భ‌ర్త‌

Delhi |

విధాత‌: త‌న 35 ఏళ్ల భార్య‌ను చంప‌డానికి ఇద్ద‌రు కాంట్రాక్ట్ కిల్ల‌ర్స్‌కు సుపారీ ఇచ్చాడు 71 ఏళ్ల భ‌ర్త‌. వారు ఆమెను బుధ‌వారం క‌త్తిపోట్ల‌కు గురి చేసి చంపేశారు. పోలీసుల ద‌ర్యాప్తులో తేలిన వివ‌రాల ప్ర‌కారం.. 71 ఏళ్ల ఎస్ కే గుప్తా.. మానసిక అనారోగ్యంతో బాధ‌ ప‌డుతున్న త‌న కుమారుడి (45) ఆల‌నా పాల‌నా చూసుకుంటుద‌ని 35 ఏళ్ల మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు.

గ‌తేడాదే వీరి వివాహం జ‌రిగింది. అయితే వివాహం అయిన త‌ర్వాత భార్య అత‌డి కుమారుడ్ని చూసుకోవ‌డానికి నిరాక‌రించింది. విడాకులు ఇవ్వాల‌ని గుప్తా కోర‌గా.. అందుకు ఆమె రూ. కోటి న‌ష్ట‌ప‌రిహారం అడిగిన‌ట్లు పోలీసులు తెలిపారు. దీంతో భార్య‌ అడ్డు తొల‌గించుకోడానికి నిందితుడు సుపారీ ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

విపిన్, హిమాన్షు అనే వ్య‌క్తుల‌ను ‘రూ.10 ల‌క్ష‌ల‌కు మాట్లాడుకున్నారు. వారు ఈ మ‌హిళ ఉంటున్న ఇంటికి వ‌చ్చి క‌త్తిపోట్ల‌తో ప్రాణం పోయేవ‌ర‌కు పొడిచారు. త‌ర్వాత ఇంట్లో ఉన్న సామాను అంతా చింద‌ర‌వంద‌ర చేశారు. దీన్ని దోపిడిగా పోలీసులు భావించాల‌ని చేయ‌డ‌మే వారి ఉద్దేశం. ఈ కేసుకు సంబంధించి గుప్తా, అత‌డి కుమారుడు, కిల్ల‌ర్స్ ఇద్ద‌రిని అరెస్టు చేశాం’ అని పోలీసులు పేర్కొన్నారు.