మోరిలో కుక్క న‌ర‌క‌యాత‌న‌.. 3 రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు.. వీడియో

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని గ్రీన్ పార్కు ఏరియాలో ఓ కుక్క త‌ప్పిపోయి మోరిలో ఇరుక్కుంది

మోరిలో కుక్క న‌ర‌క‌యాత‌న‌.. 3 రోజుల త‌ర్వాత బ‌య‌ట‌కు.. వీడియో

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని గ్రీన్ పార్కు ఏరియాలో ఓ కుక్క త‌ప్పిపోయి మోరిలో ఇరుక్కుంది. ఆ కుక్క అరుపులు విన్న స్థానికులు అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. మూడు రోజుల త‌ర్వాత కుక్క‌ను సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశారు.


గ్రీన్ పార్కు ఏరియాలో ఉండే ఓ మోరిలో కుక్క ఇరుక్కుంది. అయితే ఆ మోరిలో నుంచి కుక్క అరుస్తున్న శ‌బ్దం వ‌స్తున్న‌ప్ప‌టికీ ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఓ యువ‌కుడు మాత్రం.. ఆ మోరిలో కుక్క ఉన్న‌ట్టు గ్ర‌హించి, ఢిల్లీ అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించాడు.


అక్క‌డికి చేరుకున్న సిబ్బంది.. మోరిని తొల‌గించారు. అనంత‌రం సిబ్బంది కుక్క‌ను ప్రాణాల‌తో బ‌య‌ట‌కు తీశారు. కుక్క సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌టంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కుక్క‌ను కాపాడిన అగ్నిమాప‌క సిబ్బందిపై స్థానికులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు