Delhi | ఆశ్లీల వీడియోలకు భర్త అడిక్ట్.. ఆ వీడియోలు చూడాలని భార్యకు వేధింపులు
Delhi విధాత: ఆశ్లీల వీడియోలకు అడిక్ట్ అయిన భర్త.. తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. పోర్న్ వీడియోలు చూడాలని, పోర్న్ స్టార్‌లా దుస్తులు ధరించాలని ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి 30 ఏండ్ల యువతితో రెండేండ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్ల పాటు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఇటీవల కాలంలో భర్త ఆశ్లీల వీడియోలకు […]

Delhi
విధాత: ఆశ్లీల వీడియోలకు అడిక్ట్ అయిన భర్త.. తన భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. పోర్న్ వీడియోలు చూడాలని, పోర్న్ స్టార్‌లా దుస్తులు ధరించాలని ఆమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తికి 30 ఏండ్ల యువతితో రెండేండ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్ల పాటు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఇటీవల కాలంలో భర్త ఆశ్లీల వీడియోలకు అడిక్ట్ అయ్యాడు. నిత్యం ఫోన్‌లో ఆ వీడియోలను చూస్తూ కాలం గడుపుతున్నాడు.
ఇక భార్యను పోర్న్ వీడియోలు చూడాలని బలవంతం చేశాడు. పోర్న్ స్టార్ మాదిరి దుస్తులు ధరించాలని వేధింపులకు గురి చేశాడు. అంతేకాకుండా అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా హింసించాడు. భర్త వేధింపులు భరించలేని భార్య ఢిల్లీ పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధితురాలి భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు