పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం.. ఆ ఆరు రాష్ట్రాల్లో పోలీసుల దర్యాప్తు
ఈ నెల 13వ తేదీన పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ వదిలి నానా హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు

న్యూఢిల్లీ : ఈ నెల 13వ తేదీన పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ వదిలి నానా హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. ఆ నిందితులను ఏడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ దాడి వ్యూహకర్త లలిత్ జా, సాగర్ శర్మ, మనోరంజన్, నీలం దేవి, అమోల్ షిండే, మహేశ్ అనే నిందితులను పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రకు నిందితులను తీసుకెళ్లి దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తు కోసం ప్రత్యేకంగా 50 పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా నిందితుల సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంకు ఖాతాలు, వారి బ్యాక్‌గ్రౌండ్‌ను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
ఇక సాగర్ శర్మను సాకేత్ స్పెషల్ సెల్ విభాగం, లలిత్ జాను జనక్‌పురి స్పెషల్ సెల్ విభాగం పోలీసులు విచారిస్తున్నారు