ఎన్నికల పెండింగ్ బిల్లులను విడుదల చేయండి
గత అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సీఈఓకు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వినతిపత్రం అందచేశారు

- సీఈఓకు విజ్ఞప్తి చేసిన డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తసీల్దార్స్ అసోసియేషన్
విధాత: గత అసెంబ్లీ ఎన్నికల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షకార్యదర్శులు వి.లచ్చిరెడ్డి, కె.రామకృష్ణ, తెలంగాణ తసీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక కోరారు. బుధవారం రాష్ట్ర సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బడ్జెట్ మంజూరైనప్పటికీ నేటికి బిల్లులు చెల్లించలేదని గుర్తు చేశారు.
మరోవైపు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చిందన్నారు. బడ్జెట్ లేకపోవడంతో ఎ న్నికల విధుల్లో ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. పాత బడ్జెట్‌ను వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు తసీల్దార్లకు సంబంధించిన అద్దె వాహనాల బిల్లులు మంజూరైనప్పటికీ నేటికి పెండింగ్‌లోనే ఉన్నాయని సీఈఓ కు వింరించారు. ఆర్థిక సంవత్సరం కూడా ముగిసేందుకు దగ్గరకు వచ్చిందని, ఫైనాన్సియల్ ఇయర్ ముగియక ముందే పాత బిల్లులను క్లీయర్ చేయాలని వారు సీఈఓను కోరారు.