సుకుమార్ సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్‌ అవుట్!

విధాత,సినిమా: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ల మధ్య ఎటువంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు సుకుమార్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలకూ దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ అందించాడంటే.. వారి బంధం ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి బంధం ఉంటే.. దేవిశ్రీకి షాక్, సుకుమార్ సినిమా నుంచి అవుట్.. అని అంటారేంటి? అని అనుకుంటున్నారా? నిజమే.. సుకుమార్, దేవిశ్రీల మధ్య చాలా మంచి స్నేహ […]

  • By: krs    latest    Oct 20, 2022 5:37 PM IST
సుకుమార్ సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్‌ అవుట్!

విధాత,సినిమా: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ల మధ్య ఎటువంటి అనుబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు సుకుమార్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలకూ దేవిశ్రీ ప్రసాదే మ్యూజిక్ అందించాడంటే.. వారి బంధం ఎంత స్ట్రాంగ్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరి అలాంటి బంధం ఉంటే.. దేవిశ్రీకి షాక్, సుకుమార్ సినిమా నుంచి అవుట్.. అని అంటారేంటి? అని అనుకుంటున్నారా? నిజమే.. సుకుమార్, దేవిశ్రీల మధ్య చాలా మంచి స్నేహ బంధం ఉంది. కానీ ఈసారి అది తేడా కొట్టింది.

అయితే.. ఈ బంధం చెడింది ‘పుష్ప 2’ సినిమా విషయంలో అని అనుకుంటే పొరబడినట్లే. వారిద్దరూ కలిసి చేస్తున్న చిత్రం ‘పుష్ప 2’ కాబట్టి.. అందరూ ఆ సినిమా విషయంలో వీరిద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయేమో.. అందుకే సుకుమార్ సినిమా నుంచి దేవిశ్రీ వెళ్లిపోయాడేమో అని అంతా అనుకోవడం సహజమే. కానీ ఇది ‘పుష్ప’ మ్యాటర్ కాదు.

సుకుమార్ దర్శకుడిగానే కాకుండా నిర్మాత గానూ సినిమాలు చేస్తుంటాడనే విషయం తెలిసిందే. ఆయన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ స్థాపించి.. అందులో తన అసిస్టెంట్స్‌కి, కొత్త వారికి దర్శకుడిగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. అలానే ఇప్పుడొక సినిమాను తన బ్యానర్‌లో సుకుమార్ ప్లాన్ చేశాడు.

అందులో సాయిధరమ్ తేజ్ హీరో. ఇంతకు ముందు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ ఒక్కటే నిర్మించిన సినిమాలకు కూడా దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించారు. కానీ ఇప్పుడు సుకుమార్ రైటింగ్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.

సుకుమార్ వద్ద రచనా విభాగంలో పనిచేసిన కార్తీక్ దండు ఈ చిత్రానికి దర్శకుడు. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగా.. సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా విషయంలో దేవిశ్రీకి, సుకుమార్‌కి మధ్య రెమ్యూనరేషన్ విషయంలో విభేదాలు తలెత్తినట్లుగా తెలుస్తుంది.

రాక్ స్టార్ దేవిశ్రీ రూ. 4 కోట్లు డిమాండ్ చేశాడని, సుకుమార్ రూ. 2 కోట్లతో అడ్జస్ట్ చేసుకోమని అడగగా.. అందుకు కుదరదని దేవిశ్రీ ఈ ప్రాజెక్ట్ వదిలేసుకున్నట్లుగా సమాచారం. అయితే దేవిశ్రీ వదిలేసినా.. ఈ సినిమాకు కత్తి లాంటి మ్యూజిక్ డైరెక్టర్‌ని సుకుమార్ అండ్ టీమ్ సెట్ చేశారు.

ఈ సినిమాకి ‘విక్రాంత్ రోణ, కాంతార’ వంటి పాన్ ఇండియా చిత్రాలకు సంగీతం అందించిన మ్యూజికల్ సెన్సేషన్ అజనీష్ లోక్‌నాథ్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ విషయం అధికారికంగా ప్రకటించారు కూడా. మిస్టికల్ థ్రిల్లర్‌‌గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది.