ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు

విధాత‌, విజ‌య‌వాడ‌: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి 2022 వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి స్వర్ణకవచలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరిచారు. స్వర్ణ కవచంతో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, బంగారు ఛాయ కలిగిన మోముతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. సింహవాహనాన్ని అధిష్ఠించిన […]

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు

విధాత‌, విజ‌య‌వాడ‌: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి 2022 వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి స్వర్ణకవచలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. పాడ్యమి సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున దుర్గాదేవిని స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని అలంకరిచారు.

స్వర్ణ కవచంతో దుర్గాదేవి అష్టభుజాలతో, నక్షత్రాల కన్నా అధికమైన కాంతి కలిగిన ముక్కుపుడక ధరించి, బంగారు ఛాయ కలిగిన మోముతో అమ్మవారు దర్శనమిస్తున్నారు. సింహవాహనాన్ని అధిష్ఠించిన అమ్మ శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది.

ఈ తల్లి సకల శత్రుబాధలనూ నివారిస్తుంది. ఆకర్షణ శక్తి, ఆరోగ్య ప్రదాన లక్షణం కలిగిన స్వర్ణ కవచాన్ని ధరించిన దుర్గను ఆరాధిస్తే సకల విజయాలూ లభిస్తాయి. స్వర్ణ కవచం మంత్ర బీజాక్షర సమన్వితమై ఉంటుంది. స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి ఆరాధన వల్ల మంత్రశక్తి సిద్ధిస్తుంది.

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకుని తొలి పూజలు చేయనున్నారు. ఉత్సవాల్లో రోజుకు 60 వేల మంది వరకు భక్తులు రావొచ్చని.. అక్టోబర్​ రెండో తేదీ అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలానక్షత్రం రోజున రెండు లక్షల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పోలీసులు పట్టువస్త్రాల సమర్పణ

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి పోలీసులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మేళతాళాల నడుమ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతకుముందు వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

పీఎస్‌లోని చెట్టు వద్ద పూజలు నిర్వహించిన సీపీ దంపతులు అనంతరం ఇంద్రకీలాద్రి చేరుకుని దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, డీసీపీ విశాల్‌ గున్నీ, ఏడీసీపీ కొల్లి శ్రీనివాసరావు, ఏసీపీలు హనుమంతరావు, రవికిరణ్‌, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై శ్రీ దేవీ శరన్నవరాత్రులులలో అమ్మవారికి చేయు అలంకారాలు , కట్టే చీర రంగు , నైవేద్యం వివరాలు మీ కోసం..

తేది

వారం

శుక్ల‌ప‌క్షం

అలంక‌ర‌ణ‌

నైవేద్యం

26.09.22

సోమవారం

పాఢ్యమి

స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి

బంగారు రంగు చీర

కట్టెపొంగలి, చలిమిడి,
వడపప్పు, పాయసం.

27.09.22

మంగళవారం

విదియ

బాలాత్రిపుర సుందరీ దేవి

లేత గులాబీ రంగు చీర

పులిహార

28.09.22

బుధవారం

తదియ

శ్రీ గాయత్రీ దేవి

కాషాయ లేదా
నారింజ రంగు చీర

కొబ్బరి అన్నం,
కొబ్బరి పాయసం.

29.09.22

గురువారం

చవితి

శ్రీ అన్నపూర్ణ దేవి

గంధపురంగు లేదా

పసుపు రంగు చీర

దద్దోజనం, క్షీరాన్నం,
అల్లం గారెలు.

30.09.22

శుక్రవారం

పంచమి

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

కుంకుమ ఎరుపు రంగు చీర

దద్దోజనం, క్షీరాన్నం.

01.10.22

శనివారం

షష్ఠి

శ్రీ మహాలక్ష్మీ దేవి

గులాబీ రంగు చీర

చక్కెర పొంగలి, క్షీరాన్నం.

02.10.22

ఆదివారం

సప్తమి

శ్రీ సరస్వతీ దేవి

తెలుపు రంగు చీర

దద్దోజనం, కేసరి,
పరమాన్నం.

03.10.22

సోమవారం

అష్టమి

శ్రీ దుర్గా దేవి

ఎరుపు రంగు చీర

కదంబం, శాకాన్నం.

04.10.22

మంగళవారం

నవమి

శ్రీ మహిషాసురమర్ధిని దేవి

ముదురు ఎరుపు రంగు చీర

చక్కెర పొంగలి.

05.10.22

బుధవారం

దశమి

శ్రీ రాజరాజేశ్వరి దేవి

ఆకుపచ్చ రంగు చీర

లడ్డూలు , పులిహోర, బూరెలు , గారెలు , అన్నం.