ప్లాట్లు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లుల‌కు ఇచ్చే రైతు బంధు నిలిపి వేయాలి

ప్లాట్లు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లుల‌కు ఇచ్చే రైతు బంధు నిలిపి వేయాలి ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల పోరాట క‌మిటీ నేత మ‌న్నె న‌ర్సింహారెడ్డి అన్నారు

  • By: Somu    latest    Dec 21, 2023 12:45 PM IST
ప్లాట్లు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లుల‌కు ఇచ్చే రైతు బంధు నిలిపి వేయాలి
  • ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల పోరాట క‌మిటీ నేత మ‌న్నె న‌ర్సింహారెడ్డి


విధాత‌: గ‌తంలో రైతులు అమ్ముకున్న భూములు వ్య‌వ‌సాయేతర కార్య‌క్ర‌మాల‌కు వినియోగిస్తున్న‌ప్ప‌టికీ ధ‌ర‌ణి వ‌చ్చిన త‌రువాత వాటికి ఇస్తున్న రైతు బంధును నిలిపి వేయాల‌ని ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల పోరాట క‌మిటీ నేత మ‌న్నె న‌ర్సింహారెడ్డి ప్ర‌భుత్వాన్ని కోరారు. రైతులు అమ్ముకున్న భూముల‌కు ధ‌ర‌ణిలో తిరిగి అదే రైతుల‌కు ప‌ట్టాదారు పాస్ పుస్త‌కాలు ఇచ్చార‌న్నారు.


ఈ భూముల్లో ఇండ్లు, ప్లాట్లు, పెట్రోల్ బంకులు, కంపెనీలు, రైస్ మిల్లులు వ‌చ్చాయ‌న్నారు. ఇలాంటి భూముల‌కు న‌కిలీ ప‌ట్టాదార్ పాస్ పుస్త‌కాలు ఇవ్వ‌డంతో వంద‌ల కోట్ల రూపాయ‌లు రైతు బంధు రూపంలో ప్ర‌భుత్వం ఇవ్వాల్సి వ‌స్తుంద‌ని, వీట‌న్నింటిని తొల‌గించాల‌ని న‌ర్సింహారెడ్డి ప్ర‌భుత్వాన్ని కోరారు.